Prakash Raj: పరిశ్రమ బాగుండాలంటే ఇలాంటివి హిట్టవ్వాలి

15 Jul, 2021 00:17 IST|Sakshi
నందకిశోర్, ప్రకాశ్‌రాజ్‌

– ప్రకాశ్‌రాజ్‌

‘‘కరోనా ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి ‘నరసింహపురం‘ చిత్రాన్ని థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్న చిత్రబృందాన్ని అభినందించాలి. పరిశ్రమ బాగుండాలంటే ‘నరసింహపురం’ వంటి మీడియమ్‌ బడ్జెట్‌ చిత్రాలు భారీ విజయాలు సాధించాలి’’ అన్నారు ప్రకాశ్‌రాజ్‌. నందకిశోర్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నరసింహపురం’. టి.ఫణిరాజ్‌ గౌడ్‌–నందకిశోర్‌ ధూళిపాలతో కలిసి శ్రీరాజ్‌ బళ్లా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్‌ చూసిన ప్రకాశ్‌రాజ్‌ చిత్రబృందాన్ని అభినందించారు.

మరిన్ని వార్తలు