ప్రేమలో థ్రిల్‌

9 Aug, 2020 06:15 IST|Sakshi
శ్రీమంగం, అవంతిక హరి నల్వా

‘ఈ రోజుల్లో’ ఫేమ్‌ శ్రీ మంగం, శశాంక్‌ హీరోలుగా అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రణవం’. కుమార్‌ జి. దర్శకత్వంలో చరిత అండ్‌ గౌతమ్‌ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై తనూజ. ఎస్‌ నిర్మించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా తనూజ ఎస్‌. మాట్లాడుతూ– ‘‘లవ్‌ అండ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది.

కుమార్‌కి ఇది తొలి సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల ఆలోచనా విధానానికి తగ్గట్టుగా తెరకెక్కించారు. సంగీతం, నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి. పద్మారావ్‌ భరద్వాజ్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై సినిమాకు మంచి హైప్‌ తీసుకొచ్చాయి. చాలా కాలం తర్వాత ఆర్‌.పి. పట్నాయక్, ఉష కలిసి మా చిత్రంలో ఓ పాటను పాడారు. సునీత, అనురాగ్‌ కులకర్ణి పాడిన పాటలకూ మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మార్గల్‌ డేవిడ్, సహ నిర్మాతలు: వైశాలి, అనుదీప్‌.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా