ఇతిహాసాల నేపథ్యంలో ప్రశాంత్‌ వర్మ కొత్త మూవీ, టైటిల్‌ ఖరారు

29 May, 2021 14:37 IST|Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ బర్త్‌డే సందర్భంగా మేకర్స్‌ ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆయన నాలుగవ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీకి ‘హనుమాన్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించారు. అంతేగాక దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. పురాణ ఇతిహాసాల నుంచి పుట్టుకొచ్చిన సూపర్ హీరో కథల నుంచి స్ఫూర్తి పొందిన కొత్త కథతో ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టీజర్‌ ద్వారా మేకర్స్‌ స్పష్టం చేశారు. తెలుగులోనే ఒరిజినల్‌ సూపర్‌ హీరో ఈ మూవీ ఉండనుందని వారు పేర్కొన్నారు.

ఇక ఈ టీజ‌ర్ విషయానికి వస్తే.. నేపథ్య సంగీతంతో దైవిక అనుభూతిని కలిగించించేలా ఉండటంతో ప్రేక్షకులను విశేషం ఆకట్టుకుంటోంది. వైవిధ్యమైన కథతో సినిమాలను అందించడంలో ప్ర‌శాంత్ వ‌ర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది‌. డిఫరెంట్‌ జానర్‌తో ‘అ!’ మూవీని నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కేలా వినూత్నంగా తెర‌కెక్కించాడు ఆయన. ఆ తర్వాత జీవిత రాజశేఖర్ లీడ్‌ రోల్‌ వచ్చిన కల్కి మూవీని సరికొత్త కథాంశంతో ప్రేక్షకులకు అందించాడు. ఈ మూవీకి స్క్రీన్‌ ప్లేతో పాటు విజువల్స్, మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటీవల సౌత్‌లో తొలిసారిగా జాంబీల జానర్లో జాంబీరెడ్డి మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా సత్తా చాటుకుంది.    

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు