రామ్‌ చరణ్‌, చిరును కలిసిన ప్రశాంత్‌ నీల్‌, ఫొటోలు వైరల్‌

16 Oct, 2021 08:33 IST|Sakshi

దసరా పండుగ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే కానుకలు వచ్చాయి. విజయ దశమి రోజే సాయి తేజ్‌ బర్త్‌డే కావడం, అతడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అవ్వడం, ఆ తర్వాత రామ్‌ చరణ్‌ తన కొత్త సినిమా ఆర్‌సీ 16 మూవీ ప్రకటన ఇవ్వడం ఇలా వరుసగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు మెగా హీరోలు. ఈ క్రమంలో మరో ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. దసరా సందర్భంగా ‘కేజీఎఫ్‌’ ఫేం ప్రశాంత్‌ నీల్‌ మెగా ఇంటికి వెళ్లి అక్కడ సందడి చేశారు. ఈ నేపథ్యంలో చిరు, రామ్‌ చరణ్‌లతో దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

చదవండి: తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించిన చెర్రి, నాని డైరెక్టర్‌తో ఆర్‌సీ 16

ఈ ఫొటోలను స్వయంగా ప్రశాంత్‌ నీల్‌ షేర్‌ చేస్తూ.. ‘చిరంజీవిని కలవడంతో నా చిన్ననాటి కల నేరవెరింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే రామ్‌ చరణ్‌తో ఓ మూవీ తీయబోతున్నట్లు ఈ సందర్భంగా ప్రశాంత్‌ నీల్‌ స్పష్టం చేశాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందట. చెర్రి కోసం మెగా అభిమానులు ఊహించని స్థాయిలో ప్రశాంత్‌నీల్ కథా, కథానాలను తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తన సినిమాల్లో హీరోలను ఎలివేట్‌ చేసేలా సన్నివేశాలను క్రియేట్‌ చేయడంలో ప్రశాంత్‌ నీల్‌ సిద్దహస్తుడు.

చదవండి: విడాకుల అనంతరం సమంత కొత్త సినిమా ప్రకటన

ఆయన టేకింగ్‌ ఎలా ఉంటుందో ఇప్పటికే ‘కేజీఎఫ్‌’ చిత్రంలో చూశాం. కాగా ప్రస్తుతం ఆయన ప్రభాస్‌  సలార్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లతో కలిసి సినిమాలు చేయనున్నాడని వినికిడి. ఇక రామ్‌ చరణ్‌.. ‘ఆచార్య, ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ షూటింగ్‌లు పూర్తి కావడంతో శంకర్‌ మూవీని మొదలు పెట్టాడు. ఈ మూవీ తర్వాత గౌతమ్‌ తిన్ననూరితో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల అనంతరం ప్రశాంత్‌ నీల్‌-చెర్రిల చిత్రం పట్టాలెక్కునుందని తెలుస్తోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు