Hanuman Collections: హను-మాన్ తొలి రోజు కలెక్షన్స్‌ ఎన్ని కోట్లంటే?

13 Jan, 2024 12:08 IST|Sakshi

ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన తాజా చిత్రం హను-మాన్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. అభిమానుల భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మహేశ్‌బాబుతో చిత్రంతో పోటీలో నిలిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు.  

చిన్న సినిమాగా విడుదలై హనుమాన్ చిత్రానికి సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొదటి రోజే దాదాపు రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుతం గుంటూరు కారం కంటే హనుమాన్‌కు పాజిటివ్‌ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.  పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమాకు నార్త్ ఆడియన్స్‌ నుంచి సైతం విపరీతమైన స్పందన వస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని దాదాపు రూ.55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. 

>
మరిన్ని వార్తలు