నెక్ట్స్‌ సినిమాను అనౌన్స్‌ చేసిన 'జాంబిరెడ్డి' డైరెక్టర్‌

28 May, 2021 19:30 IST|Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. 'క్రొత్త సినిమాటిక్ యూనివర్స్' అంటూ ఓ పోస్టర్‌ను విడదుల చేశాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కనున్న 4వ సినిమా ఇది. తొలి సినిమా నుంచి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రశాంత్‌ వర్మ. రేపు మే29న ప్రశాంత్‌ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

ఈ మేరకు రేపు శనివారం ఉదయం 9గంటల 9నిమిషాలకు సినిమా ప్రకటన ఉండబోతుందంటూ ప్రశాంత్‌ వర్మ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అ, కల్కి, వంటి సినిమాలతో దర్శకుడిగా సత్తా చాటిన ప్రశాంత్‌ వర్మ ఇటీవలె తేజ సజ్జాను హీరోగా పరిచయం చేశారు. జాంబీ రెడ్డితో తొలిసారిగా సౌత్‌లో జాంబీ జోనర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు ప్రశాంత్‌ వర్మ. ఈ చిత్రం ఇటీవలె టీఆర్పీ రేటింగుల్లో కూడా దూసుకుపోయింది.జాంబిరెడ్డి తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం పీవీ4పై అంచనాలు నెలకొన్నాయి. 

చదవండి :తెలుగులో హీరోగా చేయనున్న విజయ్‌ సేతుపతి!
‘పెళ్లి సందD’ కి క్రేజీ ఆఫ‌ర్... ఓటీటీలో విడుదలకు సిద్దం!

మరిన్ని వార్తలు