Prashanth Varma : 'హనుమాన్‌' టీజర్‌.. కొత్త రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసిన ప్రశాంత్‌ వర్మ

19 Nov, 2022 13:43 IST|Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజాచిత్రం హనుమాన్‌. తేజసజ్జా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై  కె. నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.  ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ ఇదివరకే రిలీజ్‌ కావాల్సి ఉండగా సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతితో వాయిదా పడింది.

తాజాగా హనుమాన్‌ టీజర్‌పై డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈనెల 21న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను వదిలారు. కాగా ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించింది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరిన్ని వార్తలు