‘‘సినిమాను ఎప్పుడు, ఎవరికి అమ్మాలి అని ఆయా చిత్రనిర్మాత నిర్ణయించుకోవాలే కానీ ఏ అసోసియేషనో చెప్పడం కరెక్ట్ కాదు. థియేటర్స్ ఇవ్వరు.. ఓటీటీలో అమ్ముకునే అవకాశం కూడా ఇవ్వమంటే ఎలా? తన సినిమాను తనే అమ్ముకునే స్వేచ్ఛ నిర్మాతకు ఉండాలి’’ అని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష గౌడ్ అన్నారు.
మలేసియాలో ఏర్పాటయిన ‘సన్ షైన్’ అనే ఓటీటీ సంస్థ టీఎఫ్‌సీసీతో కలిసి త్వరలో ఇండియాలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ‘‘చిన్న నిర్మాతలకు థియేటర్స్ దొరకని పరిస్థితిలో ఓటీటీల వల్ల వారికి మేలు కలుగుతోంది’’ అన్నారు టీఎఫ్‌సీసీ వైస్ చైర్మన్ ఎత్తరి గురురాజ్. ‘‘ఇండియాలోని అన్ని భాషల చిత్రాలు వ ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తాం’’ అన్నారు సన్ షైన్ సీఎండీ బొల్లు నాగ శివప్రసాద్ చౌదరి. నిర్మాత తరుణీ రెడ్డి పాల్గొన్నారు.