‘స్కామ్ 1992’ నా కెరీర్‌ను మ‌లుపు తిప్పింది: ప్రతీక్‌ గాంధీ

11 Jun, 2021 14:09 IST|Sakshi

స్టాక్ బ్రోక‌ర్ హ‌ర్ష‌ద్ మెహ‌తా జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కిన ‘స్కామ్ 1992’ వెబ్‌ సిరీస్‌  అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐఎండీబీ రేటింగ్స్‌లో ప‌దికి గాను 9.6 రేటింగ్‌తో మొదటి స్థానంలో నిలిచి మోస్ట్‌ పాపులర్‌ షోగా నిలచింది. తాజాగా దీనిపై ప్రతీక్‌ గాంధీ స్పందించాడు. ‘ఇది చాలా సంతోషకరమైన విషయం. ఓ టీమ్‌గా మా క‌ళ‌పై ఉన్న న‌మ్మ‌కం మ‌రింత బ‌లోపేతమైంది. అలాంటి అరుదైన జాబితాలో ఇండియా నుంచి మా ‘స్కామ్ 1992’ మాత్ర‌మే నిల‌వ‌డం ఇది నిజంగా అరుదైన ఘనత. స్కామ్ 1992 నా కెరీర్‌ను మ‌లుపు తిప్పింది. ఇప్పుడు ఎంతో మంది దర్శక నిర్మాత నుంచి నాకు అవ‌కాశాలు వ‌స్తున్నాయి’ అంటు ఆనందం వ్యక్తం చేశాడు.

కాగా డైరెక్టర్‌ హన్స‌ల్ మెహ‌తా తెరకెక్కించిన ఈ వెబ్‌ సిరీస్‌ దేశంలో ఆల్‌టైమ్ మోస్ట్ పాపుల‌ర్ షోగా నిలిచింది. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో సోనీలివ్‌లో వ‌చ్చిన ఈ సిరీస్ విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఐఎండీబీ రేటింగ్స్‌లో ప‌దికి గాను 9.6 రేటింగ్‌తో మొదటి స్థానంలో నిలిచి ఆల్‌టైం రికార్డును సృష్టించింది. ​కేవలం ఇండియాలోనే కాకుండా ప్ర‌పంచంలోని ఆల్‌టైమ్ పాపుల‌ర్ షోల‌లో కూడా స్కామ్‌ 1992 ఒకటిగా నిలిచింది. ప్ర‌పంచంలోని 250 అత్యుత్త‌మ టీవీ షోలు, వెబ్ సిరీస్‌ల‌లో దీనికి స్థానం ద‌క్కింది. దీనితో పాటు ‘బ్యాండ్ ఆఫ్ బ్ర‌ద‌ర్స్‌, బ్రేకింగ్ బ్యాడ్‌, ద వైర్, చెర్నోబిల్’ లు ఉన్నాయి. 

చదవండి: 
స్కామ్ 1992కు అరుదైన గౌరవం

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు