ChaySam Divorce: దీనిపై చైతన్య స్టేట్‌మెంట్‌ ఇస్తే చాలు..: ప్రీతమ్‌ జుకల్కర్‌

11 Oct, 2021 13:33 IST|Sakshi

ఇంటి నుంచి బయటకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు: ప్రీతమ్‌

బతికుండగానే మా అమ్మ చనిపోయిందని ప్రచారం చేస్తున్నారు: ప్రీతమ్‌ ఆవేదన​

Samantha's stylist Preetham Jukalker Comments On Affair Rumours With Sam: టాలీవుడ్ క్యూటెస్ట్‌ కపుల్‌ నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మేము విడిపోతున్నామంటూ అక్టోబర్‌ 2 ఈ స్టార్‌ జంట అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరూ విడిపోవడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో సోషల్‌ మీడియాలో వీరి విడాకుల విషయం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో చై-సామ్‌ విడిపోవడానికి కారణాలు ఏముంటాయనే దానిపై విశ్లేషిస్తూ పలువురు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

చదవండి: ChaySam Divorce: చై-సామ్‌ విడిపోవడానికి గల కారణాన్ని ఆమె స్టైలిష్ట్‌ ఇలా బయట పెట్టాడా?

ఈ క్రమంలో చై-సామ్‌ విడిపోవడానికి సమంత స్టైలిష్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ వల్ల వీరిమధ్య మనస్పర్థలు వచ్చాయని, సమంత, ప్రీతమ్‌ చాలా సన్నిహితంగా ఉండటమే విడాకులకు దారి తీసిందంటూ కొందరూ కామెంట్‌ చేశారు. దీంతో ప్రీతమ్‌ను నెటిజన్లు దాడి చేయడం ప్రారంభించారు. అంతేగాక ఏకంగా కొందరూ సమంతకు ప్రీతమ్‌తో ఎఫైర్‌, అబార్షన్‌ చేసుకుందంటూ ఊహాగాన ఆరోపణలు కూడా చేశారు. దీంతో ఈ కామెంట్స్‌ కాస్తా వార్తల్లో నిలిచాయి. ఇప్పటికే తనపై వస్తున్న నెగిటివ్‌ కామెంట్స్‌ సమంత స్పందించిన వాటిని ఖండిచింది. తాజాగా దీనిపై ఆమె స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ కూడా స్పందించాడు. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై, సమంతపై వస్తున్న రూమార్లపై పెదవి విప్పాడు.

చదవండి: ChaySam: అఫైర్స్‌, అబార్షన్‌ వార్తలపై స్పందించిన సమంత

ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘నేను సమంతను అక్క అని పిలుస్తాను. చాలా మందికి అది తెలుసు. అలాంటిది మా మధ్య ఎఫైర్ ఎందుకు ఉంటుంది. ఐ లవ్యూ అని సోషల్ మీడియాలో ఎందుకు కామెంట్ చేశావని చాలా మంది అడుగుతున్నారు. కుటుంబ సభ్యులకు, సోదరిగా భావించే వారికి ఐ లవ్యూ చెప్పడం తప్పెలా అవుతుంది. ఎంతో మంది నన్ను ఆసభ్య పదజాలంతో తిడుతూ మెసేజ్‌లు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా కెరీర్‌ను నాశనం చేస్తామని హెచ్చరిస్తున్నారు. బతికుండగానే మా అమ్మ చనిపోయిందని కొన్ని వెబ్‌సైట్లు రాస్తున్నాయి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

చదవండి: సమంత లేటెస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌: భావోద్వేగంతో ఇలా..

అంతేగాక ‘నాగచైతన్య నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. సమంతకు, నాకు మధ్య ఉన్న అనుబంధం గురించి ఆయనకు స్పష్టంగా తెలుసు. నాకు, సమంతకు ఎఫైర్ ఉందని వస్తున్న కామెంట్ల గురించి నాగచైతన్య స్పందించకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. ఆయన ఒక్క స్టేట్‌మెంట్ ఇస్తే పరిస్థితిలో చాలా మార్పు వస్తుంది. ఫ్యాన్స్ పేరుతో కామెంట్లు చేస్తున్న వారిని అదుపులో పెట్టేందుకు నాగచైతన్య కచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతం సమంత విషాదంలో ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆమెకు కచ్చితంగా మద్దతుగా ఉంటా. ఇలాంటి ట్రోలింగ్‌కు నేను భయపడను’ అంటూ ప్రీతమ్ చెప్పుకొచ్చాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు