ముద్దు సీన్లలో నటించడం వాళ్లకు నచ్చేది కాదు: ప్రీతి జింగానియా

22 Aug, 2021 19:11 IST|Sakshi

తమ్ముడు, నరసింహానాయుడు లాంటి సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్‌ ప్రీతి జింగానియా గుర్తుండే ఉంటుంది. ఈ అమ్మడు సూపర్‌ హిట్‌ చిత్రం మొహబ్బతేన్‌ ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అందులో జిమ్మీ షెర్గిల్‌ని మైమరిపిస్తూ, సిగ్గుపడే డ్యాన్సర్ పాత్రను పోషించిన ప్రీతి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. గత రెండు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్న తర్వాత, తను నిర్మాతగా మారింది. ప్రస్తుతం ఆమె నటించడానికి ఓటీటీ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టింది.

ఇటీవల ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన సినీ పరిశ్రమ అనుభవాలను, పలు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ప్రేక్షకులు ఇప్పటికీ ఆమెను 'చుయిముయి అమ్మాయి' లేదా 'మొహబ్బతిన్ అమ్మాయి' అని పిలుస్తారని, ఈ రెండు ట్యాగ్‌లతో చిక్కుకున్నందుకు ఓ వైపు బాగానే ఉన్నప్పటికీ మరో వైపు ప్రేక్షకులు కేవలం తనను మోడరన్‌ పాత్రలో కంటే చీరలోనే చూడటానికి ఇష్టపడుతుండడం కాస్త ఇబ్బంది కలిగిస్తుందని చెప్పింది. అంతే గాక తాను ముద్దు సీన్లలో నటించడం​ కూడా ప్రేక్షకులకి నచ్చేది కాదని తెలిపింది.

అయితే తనకు మాత్రం కెరీర్‌లో ఇతర పాత్రలను కూడా చేయాలని ఉందని ఎందుకంటే తాను ఓ నిస్సహాయ కోడలిలా ఉండడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. ఇలా ఒక జోనర్‌కే పరిమితమై నటించడం ఎవరికైనా ఇష్టం ఉండదని చెప్పింది ప్రీతి. నటుడు పర్విన్ దాబాస్‌తో పెళ్లి తరువాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన ప్రీతీ ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్నారు. ప్రీతీ సినిమాలే కాక నిర్మ శాండల్ సోప్ యాడ్స్, అనేక ఇతర యాడ్స్‌లో కూడా కనిపించింది.

మరిన్ని వార్తలు