ప్రిన్స్‌ మహేష్‌బాబు @60 లక్షలు

24 Nov, 2020 20:36 IST|Sakshi

అప్పుడు ట్విట్టర్‌లో  10.9 మిలియన్ల ఫాలోవర్లతో టాప్‌ 

ఇప్పుడు  ఇన్​స్ట్రాగ్రామ్​లో 6 మిలియన్ల క్లబ్‌లో  చేరిక

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేష్‌బాబు ప్రస్తుతం పరశురామ్​ దర్శకత్వంలో  'సర్కారు వారి పాట' చిత్రంతో బిజీగా ఉన్నాడు. తాజాగా మహేష్‌ 6 మిలియన్ల క్లబ్‌లో చేరాడు. ఎందులో అనుకుంటున్నారా... ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అత్యంత వేగంగా ప్రాచుర్యం పొందిన ఇన్​స్ట్రాగ్రామ్​లో  సూపర్​స్టార్​ మహేశ్​బాబు  6 మిలియన్‌ ఫాలోవర్స్‌ను పొందాడు. ఇప్పటికే టాలీవుడ్‌ అందగాడు అనే పేరున్న మహేష్‌ సోషల్‌ మీడియా ద్వారా ఇతర భాషల అభిమానులకు చేరవయ్యాడు. ఇన్​స్ట్రాగ్రామ్​లో మాత్రమే కాదు ప్రిన్స్‌  ట్విటర్​లోనూ తన హవా చాటుకున్నాడు. ట్విట్టర్​లో 10.9 మిలియన్ల ఫాలోవర్లతో దూసుకుపోతున్నాడు. ట్విటర్‌లో దక్షిణాది నటులకు అంత ఎక్కువ ఫాలోవర్స్‌ లేరు. కరోనా ప్రభావంతో చిత్ర సీమకు సంబంధించి ఎటువంటి సమాచారమైన ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఒక రకంగా అభిమానులకు ఇది తమ అభిమాన నటులను బాగా చేరువ చేస్తుంది. 

తాజాగా తమిళ దర్శకుడు ఏఆర్​ మురుగదాస్​తో మహేశ్​ ఓ సినిమాకు సంతకం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరొక సంవత్సర కాలం తరువాత ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్​లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'స్పైడర్​' చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం మహేష్‌ చేస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో మహానటి ఫేం కీర్తి సురేష్‌ నటిస్తుంది. ఇంతకు ముందు మహేష్‌ సరసన కీర్తి నటించలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదే మొదటి చిత్రం కావడంతో అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నారు. 

https://instagram.com/urstrulymahesh?igshid=10zqpfxawvdul

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా