Prince: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ప్రిన్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడ అంటే..

3 Nov, 2022 11:04 IST|Sakshi

‘జాతిరత్నాలు’ఫేమ్‌ అనుదీప్‌ కెవి దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ప్రిన్స్‌. భారీ అంచనాల మధ్య అక్టోబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. జాతి రత్నాలు మాదిరే ఈ చిత్రంలో కూడా కామెడీ బాగా వర్కౌట్‌ అయింది. అయితే బాక్సాఫీస్‌ వద్ద మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది.

తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్నట్లు సమాచారం. నవంబర్ 25 నుంచి ఈ చిత్రాన్ని హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు వార్తలు వినిస్తున్నాయి. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. థియేటర్స్‌లో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సొంతం చేసుకొని ఈ చిత్రం ఓటీటీలో ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. 

‘ప్రిన్స్‌’ కథేంటంటే..
ఓ స్వతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వారసుడు ఆనంద్‌(శివకార్తికేయన్‌). ఇతడో స్కూలు టీచర్‌. హీరో తండ్రి విశ్వనాథ్‌(సత్యరాజ్‌) కులమతాలకు వ్యతిరేకి, అందరూ కలిసి ఉండాలనుకునే వ్యక్తి. ఇక హీరో తన స్కూల్‌లోనే మరో టీచర్‌(బ్రిటీష్‌ అమ్మాయి) అయిన జెస్సిక (మరియా ర్యాబోషప్కా)తో లవ్‌లో పడతాడు. ఇంగ్లండ్‌కు చెందిన జెస్సిక తండ్రికి ఇండియన్స్‌ అంటేనే గిట్టదు. దీంతో వారి ప్రేమకు అతడు రెడ్‌ సిగ్నల్‌ ఇస్తాడు. రానురానూ ఇద్దరి మధ్య లవ్‌స్టోరీ కాస్తా రెండు దేశాల మధ్య వార్‌లా మారుతుంది. మరి ఆనంద్‌ ప్రేమ సక్సెస్‌ అయిందా? అతడిని ఊరి నుంచి ఎందుకు గెంటేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

మరిన్ని వార్తలు