టీమిండియా క్రికెటర్‌పై దాడి.. నటి అరెస్ట్‌

17 Feb, 2023 16:18 IST|Sakshi

టీమిండియా క్రికెటర్‌ పృథ్వీ షాపై దాడి కేసులో నటి, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ సప్న గిల్‌ని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. సెల్ఫీ అడిగితే ఇవ్వడం లేదని పృథ్వీ షాపై కొంతమంది దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. వారిలో సప్న గిల్‌తో పాటు ఆమె స్నేహితులు కూడా ఉన్నారు.

ముంబైలోని ఓ స్టార్‌ హోటల్‌లో లంచ్‌కి వెళ్లిన పృథ్వీ షా, అతని స్నేహితుడు సురేంద్ర యాదవ్‌ను  సప్న గిల్‌ గ్యాంగ్‌ సెల్ఫీ అడుగుతూ ఇబ్బందికి గురి చేసింది. గమనించిన హోటల్‌ సిబ్బంది వారిని బయటకు పంపించేశారు. దీన్ని అవమానంగా భావించిన సప్న .. షా ప్రయాణిస్తున్న కారును వెంబడించి..అతనిపై దాడికి పాల్పడింది. 

దీంతో షా,సురేంద్ర యాదవ్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. సప్న గిల్‌ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సప్న గిల్ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తన డ్యాన్స్ వీడియోలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాలో ఆమె 2.20 లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు. అలాగే పలు ‘కాశీ అమర్‌నాథ్’, ‘మేరా వానత్’ వంటి భోజ్‌పురి సినిమాల్లో కూడా నటించింది.

మరిన్ని వార్తలు