గంగవ్వ, ‘కన్ను గీటు భామ’ మూతి తిప్పుడు వీడియో వైరల్‌‌

17 Apr, 2021 17:01 IST|Sakshi

తేజ సజ్జా, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇష్క్‌’. ఆర్‌బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్‌ జైన్, వాకాడ అంజన్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యస్‌.యస్‌. రాజు అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయడం అవుతున్నాడు. ఏప్రిల్‌ 23న ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది చిత్రబృందం. రోటీన్‌గా కాకుండా కాస్త డిఫెరెంట్‌, ఫన్‌ వేలో ‘ఇష్క్‌’ మూవీ ప్రమోషన్స్‌ జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఓ సెలబ్రిటీని పిలవడానినికి తేజ పడిన కష్టాలు చూడడంటూ ఓ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఆ విడియో సోషల్‌ మీడియాలో వైరలై నవ్వులు పూయించింది.

తాజాగా హీరోయిన్‌ ప్రియా ప్రకాష్‌ వారియర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ గంగవ్వకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తన దగ్గరకు వచ్చిన ప్రియా ప్రకాష్‌కు  తనదైన మాటలు, చేష్టలతో చుక్కలు చూపించింది గంగవ్వ. కన్నుకొట్టుడు కాదు మూతులు తిప్పుడంటూ.. ప్రియాకు మూతి తిప్పుడు ట్రైనింగ్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా యువ హృదయాలను కొల్లగొట్టిన ‘ఈ కన్నుగీటు భామ’.. మూతి తిప్పినా ముద్దుగానే ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు