రాహుల్‌ సిప్లిగంజ్‌‌ ‘లడిలడి’ సాంగ్‌.. వైరల్‌

20 Jan, 2021 10:29 IST|Sakshi

రోహిత్‌ నందన్,  ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా నో ఐడియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం ‘లడిలడి’ అనే పాట రూపొందింది. శ్రీచరణ్‌ పాకాల స్వరాలు అందించగా, ‘బిగ్‌ బాస్‌ 3’ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌‌‌ ‌ఈ పాటను ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ రచించిన ఈ పాటకు  రఘు మాస్టర్‌ డ్యాన్స్‌ సమకూర్చారు. ఈ పాటని ఇటీవల విడుదల చేశారు. రోహిత్‌ నందన్‌ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారిని ఆదర్శంగా తీసుకుని డ్యాన్స్, నటనలో శిక్షణ తీసుకున్నాను. లాక్‌ డౌన్‌ సమయంలో నా స్నేహితుడు శ్రీచరణ్‌ పాకాలతో కలిసి ఈ ‘లడిలడి’ అనే పాట చేయాలనుకున్నాను. ఈ పాట ద్వారానే ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆమె ఈ పాటలో డ్యాన్స్‌ చేయడమే కాదు.. పాడటం విశేషం. తొలిసారి నేను చేసిన ఈ ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆదరించడం, యూట్యూబ్‌లో మిలియన్‌కిపైగా వ్యూస్‌ రావడం  చాలా ఆనందంగా ఉంది. నేను త్వరలోనే హీరోగా ఓ ప్రముఖ దర్శకుడితో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తున్నాను’’ అన్నారు.  

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు