రష్యా రోడ్లపై చక్కర్లు కొడుతున్న ప్రియా ప్రకాశ్‌, వీడియో వైరల్‌

14 Jul, 2021 18:29 IST|Sakshi

కన్నుగీటు భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ రష్యాలో హాలిడే వేకషన్‌ను ఎంజాయ్‌ చేస్తున్న ఆమె తాజా ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. స్నేహితులతో కలిసి రష్యా రోడ్లపై ఆమె చక్కర్లు కొడుతుంది. ఈ ఫొటోలను ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘ఓరు ఆధార్ లవ్’ అనే మలయాళ మూవీతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన ప్రియా ప్ర‌కాశ్... ఒకే ఒక్క కన్ను గీటుతో కుర్రకారును కట్టిపెడేసింది. దీంతో ఆమె ‘వింక్‌గాళ్’గా దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది.

ఇటీవల జాంబీరెడ్డి హీరో తేజ సజ్జాతో కలిసి ‘ఇష్క్‌’ మూవీలో నటించిన ప్రియా ప్రకాశ్‌ షూటింగ్‌ పూర్తి కావడంతో హాలీడే వేకేషన్‌కు రష్యా పర్యటనకు వెళ్లింది. రష్యా రాజధాని మాస్కోలో స్నేహితులతో కలిసి షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్‌కు వెళుతూ అక్కడ రోడ్లపై రచ్చ రచ్చ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులంతో పంచుకుంది. కాగా నితిన్‌ చెక్‌ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ప్రియా ప్రకాశ్‌ ఆ తర్వాత తేజ సజ్జతో ఇష్క మూవీలో నటించింది. ఎప్రిల్‌ విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు