షూటింగ్‌లో నితిన్‌పైకెక్కి కింద పడ్డ ప్రియా ప్రకాశ్‌

26 Feb, 2021 11:42 IST|Sakshi

కన్ను గీటు భామ, కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్‌ వరియర్‌, యంగ్‌ హీరో నితిన్‌ నటించిన ‘చెక్’‌ మూవీ ఇవాళ(ఫిబ్రవరి 26) థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్‌ ‘చెక్’‌ మూవీ షూటింగ్‌లో సమయంలో జరిగిన ఓ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. మూవీ షూటింగ్‌లోని ఓ రోమాంటిక్‌ సన్నివేశం చిత్రీకరణలో నితిన్‌ నడుచుకుంటూ వస్తుంటాడు. ఆ తర్వాత‌ వెనకాలే ప్రియా ప్రకాశ్‌ పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా నితిన్‌ వీపుపైకి ఎగిరి ఎక్కుతుంది. దీంతో పట్టు తప్పి నెలపై వెల్లకిలా పడిపోయింది.

ఆమె పడిపోగానే చూట్టు ఉన్న మూవీ యూనిట్‌ సభ్యులు ఆమె దగ్గరి వచ్చి పైకి లేపారు. అయితే తనకి ఏమి కాలేదు అన్నట్లు ప్రియా సైగ చేసి కొద్ది సమయం తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొంటుంది. దీనికి ‘జీవితంలో కింద పడిపోతున్న ప్రతిసారి నేను విశ్వాసంతో పైకి లేచేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పడానికి ఈ వీడియో ప్రాతినిథ్యం వహిస్తుంది’ అంటూ షేర్‌ చేసింది. కాగా వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. ఇందులో నితిన్‌కు జోడిగా ప్రియా ప్రకాశ్‌, రకుల్‌ ప్రిత్‌ సింగ్‌లు కథానాయికలుగా నటించారు. 

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier)

 చదవండి: రకుల్‌ను డామినేట్‌ చేస్తున్న ప్రియా వారియర్
                 ట్రైలర్‌: దేశద్రోహితో చెస్‌ ఆడిస్తారా?!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు