రకుల్‌ను డామినేట్‌ చేస్తున్న ప్రియా వారియర్‌

23 Feb, 2021 20:49 IST|Sakshi

'అనుకోకుండా ఒక రోజు', 'ఒక్కడున్నాడు', 'సాహసం' వంటి వినూత్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి డైరెక్షన్‌లో హీరో నితిన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం చెక్‌. ఈ సినిమా టీజర్‌ చూడగానే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనిపించిందని, కథాంశం అంత వైవిధ్యంగా ఉందని టాప్‌ డైరెక్టర్‌ రాజమౌళే కితాబిచ్చారంటే ఈ టీజర్‌ జనాలను ఎంతగా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తాజాగా ఈ చిత్రం నుంచి 'నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను..' పాట ప్రోమో రిలీజ్‌ చేశారు. ఇందులో తన ప్రియురాలు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను చూడలేకుండా ఉండలేకపోతున్నానని పాడుతున్నాడు నితిన్‌. అక్కడేమో ప్రియా తన అందంతో హీరోనే కాదు కుర్రకారును కూడా తన వెంటపడేలా చేస్తోంది. ఈ సాంగ్‌ ప్రోమో రిలీజైన కొద్దిసేపటికే సోషల్‌ మీడియాలో #PriyaPrakashVarrier అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది.

ఈ సినిమాలో రకుల్‌ కన్నా ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ప్రియానే బాగుందంటున్నారు కొందరు నెటిజన్లు. చెక్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్న ప్రియా వచ్చీరావడంతోనే రకుల్‌ను డామినేట్‌ చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్‌ అవకముందే ఈ మలయాళీ ముద్దుగుమ్మ అందచందాలు, నటనకు ఫిదా అయిపోతున్నారు ప్రేక్షకులు. మరి ఈ సినిమా తర్వాత ప్రియాకు తెలుగులో ఇంకెన్ని అవకాశాలు వస్తాయో చూడాలి! కాగా చెక్‌ సినిమాలో ప్రియా హొయలను చూడాలన్నా, ఉగ్రవాదిగా నితిన్‌, లాయర్‌గా‌ రకుల్‌ ఏ మేరకు మెప్పిస్తారో తెలియాలన్నా ఫిబ్రవరి 26 వరకు ఆగాల్సిందే!

చదవండి: కాలంతో పాటు వెళ్లడమే మంచిది: దర్శకుడు

హైదరాబాద్‌లో పవన్‌ షూటింగ్‌.. భారీ సెట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు