Priyamani In Devara Movie: ప్రియమణిపై మరో రూమర్స్‌.. జీర్ణించుకోలేకపోతున్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌

27 Sep, 2023 07:27 IST|Sakshi

సౌత్‌ ఇండియాలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ప్రియమణి పేరు చెప్పగానే తెలుగువారికి మొదట గుర్తుకు వచ్చే సినిమా యమదొంగ అందులో జూ.ఎన్టీఆర్‌తో ఆమె అమాయకంగా తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. ఆమె వ్యక్తిగత జీవితంలోనే కాకుండా పలుమార్లు సినిమాల విషయంలో కూడా రూమర్లు వస్తూనే ఉంటాయి. తాజాగా  ఎన్టీఆర్‌ అభిమానులను షాకింగ్‌కు గురిచేస్తూ ఆమె గురించి మరో రూమర్‌ వచ్చింది.

(ఇదీ చదవండి: 29న నటి విజయలక్ష్మి కోర్టులో హాజరుకావాల్సిందే)

ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబోలో వస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'దేవర' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో తారక్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దానిని మేకర్స్‌ కూడా ఖండించలేదు. దీంతో అదే నిజం అని దాదాపు ఫ్యాన్స్‌ కూడా ఫిక్స్‌ అయ్యారు. ఇందులో తారక్‌కు తల్లిగా ప్రియమణి నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన ఫ్యాన్స్‌ కూడా ఆశ్చర్యపోతున్నారు. గతంలో జంటగా నటించిన ఈ జోడీ ఇప్పుడు 'దేవర'లో తల్లీకొడుకులుగా నటిస్తున్నారనే రూమర్స్‌ రావడంతో ఇదే నిజమేనా అని ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

ఈ నిర్ణయంపై అభిమానుల నుంచి కాసింత వ్యతిరేకత కూడా వస్తుంది. కానీ మేకర్స్‌ మాత్రం ఇప్పటికి ఎలాంటి అధికారిక ప్రకటన ఇ‍వ్వలదు. గతంలో కూడా అల్లు అర్జున్‌ 'పుష్ప-2'లో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఆ వార్తల్లో నిజం లేదని ఆమె తెలిపింది. కానీ బన్నీతో సినిమా ఛాన్స్‌ వస్తే తప్పకుండా చేస్తానని ఆమె ప్రకటించింది. బాలీవుడ్‌ కింగ్‌ షారుక్‌ ఖాన్‌ 'జవాన్‌' లో ప్రియమణి నటించడమే కాకుండా అందరిని మెప్పించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు