ముస్తఫా మొదటి భార్య ఆరోపణలు... ప్రియమణి స్పందన

22 Jul, 2021 16:34 IST|Sakshi

నటి ప్రియమణి, ముస్తాఫా రాజ్‌ల వివాహం చెల్లదంటూ ఆయన మొదటి భార్య  అయేషా వాదిస్తోన్న సంగతి తెలిసిందే. ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని.. కనుక ఇప్పటికీ ఆయన తన భర్తే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా అయేషా వ్యాఖ్యలపై ప్రియమణి పరోక్షంగా స్పందించింది. తమది చట్టవిరుద్ధ సంబంధం కాదని, చాలా బంధానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని(సెక్యూర్‌ రిలేషన్‌షిప్‌) అని స్పష్టం చేసింది. ఓ జాతీయ మీడియాతో ప్రియమణి మాట్లాడుతూ.. తన వివాహంపై వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. ముస్తఫా భర్తగా దొరకడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారని, అయినప్పటికీ రోజూ ఇద్దరం ఫోన్‌లో మాట్లాడుకుంటామని చెప్పింది. 

‘ఎక్కడ ఉన్నా కమ్యూనికేషన్‌ అనేది చాలా ముఖ్యమైనది. నాకు, ముస్తాఫాకు మధ్య ఉన్న రిలేషన్‌ గురించి అడిగితే.. మేము చాలా అన్యోన్యంగా ఉంటున్నాం. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటీకి ఇద్దరం ప్రతి రోజు ఫోన్‌లో మాట్లాడుకుంటాం. ఒకవేళ బిజీగా ఉండి మాట్లాడుకోకపోతే.. కనీసం హాయ్‌, బాయ్‌ అయినా చెపుకుంటాం. ఆయన ఫ్రీగా ఉంటే నాతో చాట్‌ చేస్తాడు. నేను కూడా షూటింగ్స్‌ లేకుండా ఖాళీగా ఉంటే అతనికి ఫోన్‌ చేస్తా.

ఇలా ప్రతి రోజు మేం మాట్లాడుకుంటునే ఉంటాం. కొంతమంది మా బంధంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారందరికి నేను చెప్పేది ఒక్కటే. మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. ప్రతి విషయాన్ని షేర్‌ చేసుకుంటాం. ఏ బంధానికైనా అది చాలా అవసరం’ అని ప్రియమణి చెప్పుకొచ్చింది. 

కాగా.. ముస్తఫా రాజ్, ప్రియమణిని పెళ్లి చేసుకోక ముందే 2010లో ఆయేషాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లయ్యాక కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత.. భేదాభిప్రాయాలతో విడిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరు విడివిడిగా ఉంటూ వచ్చారు. ఇక తమ పిల్లల కోసం ముస్తఫా రాజ్ ప్రతి నెలా కొంత మొత్తం పంపిస్తున్నాడు. ఈ క్రమంలోనే 2017లో హీరోయిన్ ప్రియమణిని వివాహం చేసుకున్నాడు ముస్తాఫా రాజ్. అప్పటి నుంచి ప్రియమణితో కలిసి ఉంటున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు