న్యూడ్‌ ఫోటో అడిగిన నెటిజన్‌.. అలా చేస్తే ఓకే అన్న ప్రియమణి

31 Mar, 2021 14:00 IST|Sakshi

ప్రియమణి.. అందంతో పాటు మంచి అభినయం ఉన్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎవరే అతగాడు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. పరుథి వీరన్‌ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. తెలుగులో నాగార్జున, ఎన్టీఆర్‌తో పాటు పలువురు స్టార్‌ హీరోల సరసన నటించింది.హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. 2017లో ముస్తఫా రాజ్‌ను వివాహం చేసుకున్న ప్రియమణి.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతుంది.

మూవీస్‌తో పలు వెబ్‌ సీరీస్‌లలో కూడా నటిస్తుంది.వీటితో పాటు పాటు బుల్లితెరపై ఓ డ్యాన్స్‌ షోకు న్యాయ నిర్ణేతగా కూడా చేస్తుంది. ఇక సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దు గుమ్మ..ఇటీవల తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఖాతాలో బ్లాక్‌ డ్రెస్‌లో ఉండే ఫోటోలని షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ వైరల్‌ అవుతంది. ఈ ఫోటోలపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపించగా.. ఓ నెటిజన్‌ మాత్రం బిత్తిరి ప్రశ్న అడిగి అభాసుపాలయ్యాడు.

మీ న్యూడ్‌ ఫోటో షేర్‌ చేయండంటూ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ప్రియమణి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. నా కంటే ముందు మీ సోదరిని లేదా మీ తల్లి గానీ అలాంటి ఫోటో అడిగి షేర్‌ చేయండి.. అప్పుడు నేను కూడా పెడతా’అని జవాబిచ్చింది. ప్రియమణి సమాధానం చూసి ఆ నెటిజన్‌ షేమ్‌గా ఫీలై.. క్షమాపణలు కోరాడు. కాగా, ప్రియమణి ఇచ్చిన సమాధానంపై పలువులు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. సరైనా సమాధానం ఇచ్చావంటూ మెచ్చుకుంటున్నారు.
చదవండి:
వైరల్ అవుతున్న బాలకృష్ణ న్యూ లుక్ 
రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్‌ వైరల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు