ఆ విషయంలో అట్లీ నన్ను మోసం చేశాడు: ప్రియమణి

13 Sep, 2023 07:22 IST|Sakshi

తమిళసినిమా: బహుభాషా నటిగా రాణిస్తున్న ప్రియమణి మొదట్లో హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ తెచ్చుకున్నారు. తమిళంలో పరుత్తివీరన్‌ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. కాగా వివాహానంతరం తన వయసుకు తగిన పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జవాన్‌ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ చిత్రంలో నటించిన గురించి ప్రియమణి ఒక భేటీలో పేర్కొంటూ జవాన్‌ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఏదో క్యామియో పాత్ర అయి ఉంటుందని భావించారన్నారు. అయితే షారుక్‌ ఖాన్‌ టీం లో ఒకరిగా ముఖ్యమైన పాత్ర అని తెలియగానే చాలా సంతోషించానన్నారు.

అట్లీ దర్శకుడు అని చెప్పగానే నటిస్తానని చెప్పానన్నారు. అలా ఒకసారి జూమ్‌ కాల్‌లో దర్శకుడు అట్లీ, ఆర్య మాట్లాడారని చెప్పారు. అట్లీ తన మిత్రుడు అని పరిచయం చేసి ఆర్య వెళ్లిపోయారన్నారు. అలా ప్రియమణి జవాన్‌ చిత్రంలో నటిస్తుందన్న వార్త వెలువడగానే ఏదో ఐటమ్‌ సాంగ్‌ అయ్యింటుందనే ప్రచారం జరిగిందన్నారు. అలాంటి ప్రచారాన్ని తాను పట్టించుకోలేదన్నారు.

అయితే దర్శకుడు అట్లీ తనను చాలా ఏమార్చారన్నారు.. జవాన్‌ చిత్రం తమిళ వర్షన్‌లో నటుడు విజయ్‌ గెస్ట్‌ రోల్‌ లో నటించనున్నారని, అదే విధంగా తెలుగు వెర్షన్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆ పాత్రను నటించనున్నారని ప్రచారం హోరెత్తిందన్నారు. విజయ్‌ ఇందులో నటిస్తున్నారా..? అని తాను అట్లీని అడగ్గా నటింపజేస్తే పోద్ది అన్నారన్నారు. అయితే విజయ్‌తో తనను ఒక్క సన్నివేశంలోనైనా నటింపజేయమని కోరగా అలాగే అన్నారని, అయితే చివరివరకూ దర్శకుడు అట్లీ తనను అలా ఏమార్చుతూనే వచ్చారని వెల్లడించారు. నిజానికి ఈ చిత్రంలో విజయ్‌ గానీ, జూనియర్‌ ఎన్టీఆర్‌ గానీ నటించలేదని ప్రియమణి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు