‘బంగార్రాజు’లో చైతన్యకు జోడిగా సమంత కాదు ఆ హీరోయిన్‌ అట!

27 May, 2021 17:39 IST|Sakshi

‘కింగ్‌’ నాగార్జున అక్కినేని-రమ్యకృష్ణ జంటగా డైరెక్టర్‌ కల్యాణ్‌ కృష్ణ తెరకెక్కించిన హిట్‌ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయన’. మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్‌ కల్యాణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ ప్రాజెక్ట్‌ స్క్రిప్ట్‌ పూర్తి కావడంతో సెట్స్‌పైకి తీసుకుళ్లేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కాగా ఇందులో నాగార్జున-రమ్యకృష్ణలు జంటగా నటిస్తుండగా అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్‌లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే ఇందులో నాగ చైతన్య పాత్ర కీలకంగా ఉండనుందని, అందుచేత ఆయనకు జోడిగా అక్కినేని వారి కోడలు, స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించనున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అది తెలిసి అక్కినేని అభిమానులంతా తెగ సంబరపడిపోయారు. మరోసారి ఈ రియల్‌ లైఫ్‌ జంటను రీల్‌లో చూడబోతున్నామంటూ  మురిసిపోయారు. ఇదిలా ఉండగా తాజా బజ్‌ ప్రకారం ఇందులో చైతన్యనకు జోడిగా తమిళ హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌ను మూవీ మేకర్స్‌ సంప్రదించినట్లు తెలుస్తోంది.

‘గ్యాంగ్ లీడర్, శ్రీకారం’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన అరుల్‌ తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటోంది. ఈ క్రమంలో బంగార్రాజులో నటించేందుకు ఆమెను సంప్రదించగా వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇందులో నాగ చైతన్య నాగార్జునకు తండ్రి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. జూలైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని నాగార్జున ఇప్పటికే ప్రకటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు