ఆ రాత్రి కత్రినా.. ఆలియాకి ఫోన్‌ చేశా! – ప్రియాంకా చోప్రా

10 Aug, 2021 22:55 IST|Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్లు ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్‌ కలిసి ఓ రోడ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేశారు. కానీ ఇది హాలీడే ట్రిప్‌ కాదు.. సినిమా ట్రిప్‌. ప్రియాంక, కత్రినా, ఆలియా భట్‌ ప్రధాన పాత్రధారులుగా హిందీలో ‘జీ లే జరా’ చిత్రం రూపొందనుంది. రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఫర్హాన్‌ అక్తర్‌ డైరెక్ట్‌ చేస్తారు. 2011లో వచ్చిన ‘డాన్‌ 2’ తర్వాత ఫర్హాన్‌ డైరెక్ట్‌ చేస్తున్న హిందీ చిత్రం ఇదే. ‘‘2019 నవంబరులో ముంబైలో వర్షం కురిసిన ఓ రాత్రి నాలో ఏవో కొత్త ఆలోచనలు.

ఆలియా భట్, ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్‌
హిందీలో ఫీమేల్‌ మల్టీస్టారర్‌ సినిమాలు ఎందుకు తక్కువగా ఉన్నాయి? అసలు మనం ఎందుకు ఓ ఫీమేల్‌ మల్టీస్టారర్‌లో నటించకూడదు? అని ఆలోచించి, నా స్నేహితురాళ్లు కత్రినా, ఆలియా భట్‌లకు ఫోన్‌ చేసి మాట్లాడాను. 2020 ఫిబ్రవరిలో మేం కలుసుకున్నాం. ఫైనల్లీ మా కాంబినేషన్‌ కుదిరింది. ప్రేక్షకులకు ఓ మంచి మల్టీస్టారర్‌ని ఇవ్వడానికి రెడీ అయ్యాం. స్నేహానికి సెలబ్రేషన్‌లా మా సినిమా ఉంటుంది ’’ అన్నారు ప్రియాంకా చోప్రా. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.  

మరిన్ని వార్తలు