నా రియల్‌ లైఫ్‌ బాలీవుడ్‌ హీరో..

3 Dec, 2020 15:54 IST|Sakshi

ముంబై: గ్లోబల్‌ కపుల్‌ ప్రియాంక చోప్రా-నిక్‌ జోనస్‌లు ఈ నెలలో(డిసెంబర్‌ 2వ తేదీ) వారి సెంకడ్‌ వెడ్డింగ్‌ యానివర్సరీని జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియాంక-నిక్‌లు వారి పెళ్లినాటి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ ఒకరికోకరూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రియాంక వారి పెళ్లి ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘రెండేళ్లు గడిచాయి.. కానీ జీవితాంతం వరకు’ అనే క్యాప్షన్‌తో తన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అదే విధంగా నిక్‌ జోనస్‌ కూడా వారి హిందూ వెడ్డింగ్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘రెండు రోజులు.. రెండు సంప్రదాయాలు.. ఇప్పడు రెండేళ్లు. తన దేశంలోనే ప్రియాంకను హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం చాలా గౌరవంగా ఉంది. సమయం ఎంత త్వరగా గడిచిపోయిందో.. నమ్మలేకపోతున్న. హిందూ వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రియాంక’ అంటూ విషెస్‌ తెలిపాడు. (చదవండి: ప్రియాంకా చోప్రా దూకుడు : బిగ్ న్యూస్)

A post shared by Nick Jonas (@nickjonas)

నిక్ పోస్ట్‌కు‌ ప్రియాంక ‘నా నిజ జీవితంలో బాలీవుడ్‌ హీరో.. ఐ లవ్‌ యు హ్యాండ్సమ్‌‌’ అంటూ కామెంట్‌ పెట్టారు. కాగా ఆమెరికా పాప్‌ సింగర్‌ అయిన నిక్ జోనస్‌, ప్రియాంకలు కొంతకాలం ప్రేమించుకుని 2018 డిసెంబర్‌ 2న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ భిన్న సంప్రదాయానికి చెందిన వారు కావడంతో వీరి పెళ్లి  హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల్లో జరిగింది. ఇండియాలో జోధ్‌పూర్‌లోని ఉమైడ్‌ భవన్‌ ప్యాలెస్‌లో కటుంబ సభ్యులు, సన్నిహితులు, బాలీవుడ్‌, హాలీవుడ్‌ ప్రముఖుల మధ్య ప్రియాంక-నిక్‌ల‌ వివాహం రెండు రోజులు, రెండు సంప్రదాయల్లో జరిగింది. (చదవండి: మిస్‌ వరల్డ్‌ గెలిచిన తర్వాత అమ్మ నాతో..)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా