ఆ హీరోతో బాత్రూంలో ప్రియాంక: నెటిజన్ల సెటైర్లు

6 May, 2021 07:46 IST|Sakshi

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా తొలిసారి 'మెట్‌ గాలా' ఈవెంట్‌కు హాజరైన ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. అక్కడ రెడ్‌ కార్పెట్‌ హొయలు ఒలికించిన ఈ భామ 2017లో తన ప్రియుడు నిక్‌ జోనస్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైంది. ఈ ఫ్యాషన్‌ ఈవెంట్‌కు సంబంధించిన పలు ఫొటోలను సింగర్‌ రీటా ఓరా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఇందులో ప్రియాంక బ్లాక్‌ పాంథర్‌ నటుడు మైఖేల్‌తో మాట్లాడుతోంది. అయితే వీళ్లు కబుర్లు చెప్పుకుంటోంది బాత్రూమ్‌లో కావడం గమనార్హం. వీళ్లిద్దరితో పాటు మరికొంతమంది కూడా అక్కడే ఉన్నారు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు బాత్రూమ్‌లో చర్చలు పెట్టుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు. మీకు వేరే చోటే దొరకలేదా? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా ప్రియాంక 2018లో రెండోసారి 'మెట్‌ గాలా'కు హాజరవగా, 2019లో భర్త నిక్‌తో మరోసారి ఈవెంట్‌లో తళుక్కున మెరిసింది.

ఇదిలా వుంటే ఈ ఏడాది ప్రియాంక బోలెడు ప్రాజెక్టులకు సంతకం చేసింది. అందులో టెక్స్ట్‌ ఫర్‌ యూ చిత్రాన్ని ఇదివరకే కంప్లీట్‌ చేయగా మరికొన్ని షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఇక ఈ మధ్యే న్యూయార్క్‌లో సోనా అనే రెస్టారెంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

చదవండి: భారతదేశానికి హాలీవుడ్‌ సాయం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు