సర్జరీ చేయించుకున్న హీరోయిన్‌, కానీ అద్దంలో చూసుకున్నాక బెంబేలెత్తిపోయింది!

9 Mar, 2023 21:07 IST|Sakshi

టాలెంట్‌ ఒక్కటి ఉంటే సరిపోదు, అందం కూడా కావాలి. నటిగా, హీరోయిన్‌గా ఎదగాలంటే కాస్తోకూస్తో అందం, ఆకర్షణ ఉండాలి. ఇందుకోసం సెలబ్రిటీలు డైట్‌, ఎక్సర్‌సైజ్‌, యోగాలంటూ నానాతంటాలు పడతారు. కానీ కొంతమంది ఏకంగా సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఆ జాబితాలో స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా కూడా ఉంది. ఆమె తన ముక్కుకు సర్జరీ చేయించుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ఆత్మకథ 'అన్‌ఫినిష్‌డ్‌'లో రాసుకొచ్చింది.

'డాక్టర్‌ నా ముక్కును సర్జరీ చేసే క్రమంలో కాస్త పట్టు కోల్పోయాడు. దీంతో నా ముక్కు ఆకారమే మారిపోయింది. బ్యాండేజీ తొలగించగానే నా ముక్కు చూసి అమ్మ, నేను భయపడిపోయాము. అది వంకరగా మారిపోయి నా ముఖమే మరోలా కనిపించింది. అసలు నేను నేనులానే లేను. అద్దంలో చూసుకున్నప్పుడు వేరే ఎవరో నన్ను చూస్తున్నట్లుండేది. నిస్సహాయురాలిగా ఉండిపోయాను. నా ఆత్మగౌరవం మంటగలిసిపోయినట్లైంది. తిరిగి కోలుకుంటాననుకోలేదు' అని రాసుకొచ్చింది. కాగా ప్రియాంక చోప్రా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో అందంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేదని, ఈ క్రమంలోనే తను సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వచ్చాయి. అయితే సర్జరీ సక్సెస్‌ కాకపోవడంతో అందవిహీనంగా మారిన ముక్కును తిరిగి సాధారణ స్థితికి తెచ్చేందుకు మళ్లీ సర్జరీలు చేయించుకోలేక తప్పలేదట!

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు