Priyanka Chopra: ప్రియాంక చోప్రా: ఇండియాను నా నుంచి విడదీయలేరు.. ఎందుకంటే

18 Dec, 2021 20:34 IST|Sakshi

Priyanka Chopra Interesting Comments On India And Culture: గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక జోనాస్‌ ఎప్పుడూ తన సినిమాలతో బిజీగా ఉంటుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే తన అస్థిత్వాన్ని, గుర్తింపును ఎవరైన తక్కువ చేసిన ఊరుకోదు. వెంటనే కౌంటర్‌ ఇస్తుంది ప్రియాంక. ఇందుకు ఉదాహరణ ఇటీవల తనను 'వైఫ్‌ ఆఫ్‌ జోనాస్‌'గా ప్రస‍్తావించడమే. ప్రస్తుతం ప్రియాంక తన రాబోయే సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ది మ్యాట్రిక్స్‌ రిసరెక్షన్స్‌ ప్రమోషన్‌లో బిజీగా ఉంది. 'ది మ్యాట్రిక్స్‌' ఫ్రాంచైజీ నుంచి 18 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో ప్రియాంక సీత పాత్రను పోషించింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఎమ్మీ అవార్డుకు నామినేట్‌ అయిన టెలివిజన్ హోస్ట్‌ రాషా గోయెల్‌తో ముచ్చటించింది ప్రియాంక. 

ఈ క్రమంలోనే ప్రియాంక తన మూలాలను గుర్తు చేసుకుంది. తాను ఇంటికి దూరంగా ఉన్నట్లు ఎప్పుడూ భావించలేదని చెప్పింది. అలాగే 'మీరు నన్ను భారతదేశం నుంచి బయటకు తీసుకురావచ్చు. కానీ భారతదేశాన్ని నా నుంచి వేరు చేయలేరు. నేను ఎక్కడికీ వెళ్లినా నాతోపాటు నా సంస్కృతి కూడా వస్తుంది. అందుకే నేను ఎప్పుడూ ఇంటికు (ఇండియా) దూరంగా ఉన్నట్లు భావించలేదు. నా ఇళ్లు, నా మందిరం, మా అమ్మ, నా ఆచారాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. కాబట్టి నేను బాగానే ఉన్నాను. ఇలా ఉన్నందుకు నేను ఎప్పుడూ బాధపడను.' అని చెప్పుకొచ్చింది ప్రియాంక జోనాస్‌. 

ప్రియాంక, నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న తర్వాత యునైటెడ్‌ స్టేట్స్‌ (అమెరికా)లో నివసిస్తోంది. ఇప్పుడు ఇది చాలా వ్యూహాత్మకంగా ఉందని భావిస్తున్నట్లు ప్రియాంక తెలిపింది. అలాగే రెండు పరిశ్రమలను (బాలీవుడ్‌, హాలీవుడ్‌) బ్యాలెన్స్‌ చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఎందుకంటే అలా చేయగలిగే నటులు ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ మంది ఉన్నారని ప్రియాంక అభిప్రాయపడింది. 

ఇదీ చదవండి: 'నిక్‌ జోనాస్‌ వైఫ్‌' అన్నందుకు ప్రియాంక చోప్రా ఫైర్‌..

మరిన్ని వార్తలు