Priyanka Chopra Nick Jonas: హరహర మహాదేవ్​.. శివుడికి ప్రియాంక-నిక్​ జోనాస్​ దంపతుల పూజలు

1 Mar, 2022 21:10 IST|Sakshi

Priyanka Chopra Nick Jonas Celebrate Mahashivratri In Los Angeles: గ్లోబల్ స్టార్‌ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్​ దాకా ఎదిగి తనదైన ముద్ర వేసుకుంది. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా భారతీయ మూలాలను, భారతదేశ సంస్కృతిని, తన అస్థిత్వాన్ని మరిచిపోనని ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్లే లాస్​ ఏంజిల్స్​లోని తమ ఇంట్లో పరమశివున్ని కొలిచింది ప్రియాంక-నిక్​ జోనాస్ జంట. ఇండియాలో ఘనంగా జరుపుకునే పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. మార్చి 1 మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడికి పూజ చేశారు ప్రియాంక చోప్రా, నిక్​ జోనాస్​. 

ఈ విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా తెలిపింది ప్రియాంక చోప్రా. తన ఇన్​స్టా స్టోరీలో 'మహా శివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ్​. శివరాత్రి జరుపుకుంటున్న ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు. ఓం నమః శివాయ' అంటూ శివుడి విగ్రహానికి పూజ చేస్తున్న ఫొటోను షేర్​ చేసింది. ఈ ఫొటోలో ప్రియాంక గులాబీ రంగు గల సాంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, తెల్లటి కుర్తా పైజామాలో నిక్​ జోనాస్​ కనిపించాడు. ప్రియాంక కజిన్​ దివ్య జ్యోతి కూడా ఈ వేడుకల్లో పాల్గోంది. 

మరిన్ని వార్తలు