విజనరీ ఫిలాంత్రఫిస్ట్‌: బాలీవుడ్‌ బ్యూటీ ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌

3 May, 2021 19:52 IST|Sakshi

 రియల్‌ హీరో సోనూ సూద్‌పై ప్రియాంక చోప్రా ప్రశంసలు

సాక్షి, ముంబై: కరోనా సంక్షోభ సమయంలో బాధితుల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచిన నటుడు సోనూసూద్‌కు తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా మద్దతుగా నిలిచారు. కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్యను అందించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గత వారం సోనూ షేర్‌ చేసిన వీడియోను రీట్వీట్‌ చేసిన గ్లోబల్‌ బ్యూటీ సోనూపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు  విజనరీ ఫిలాంత్రఫిస్ట్‌, దూరదృష్టి కలిగిన పరోపకారి సోను అంటూ తన సహ నటుడిని కొనియాడారు. (సలాం సోనూ సూద్‌...మీరో గొప్ప వరం!)

మొదటగా సోనూ సూద్‌  నిశితమైన పరిశీలన తనను  ఆకట్టుకుందని కమెంట్‌ చేశారు. అలాగే టిపికల్‌ సోనూ శైలిలో  పరిష్కారం కోసం ఆలోచించడం,  సలహాలతో ముందుకు   రావడం తనకు చాలా న చ్చిందని ఆమె పేర్కొన్నారు.  దీనిక ప్రభుత్వ, ప్రభుత్వేతన శక్తులు  స్పందించి  ముందుకు రావాలని కోరారు.  ప్రతీ విద్యార్థికి విద్య అనేది పుట్టుకతో వచ్చిన హక్కుగా భావించే వ్యక్తిగా ఈ విషయంలో తన పూర్తి మద్దతు సోనూకేనని  పీసీ ట్వీట్‌ చేశారు.  కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికులను ఆదుకుని రియల్‌ హీరోగా అవతరించిన సోనూసూద్‌ విద్యార్థుల ఆన్‌లైన్‌ చదువులకు ఆటంకం రాకుండా అనేక చర్యలు తీసుకున్నారు. కేవలం ఒక విద్యార్థిని కోసం మొత్తం గ్రామానికి ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించిన పెద్ద మనుసు సోనూ సూద్‌ సొంతం. ఇలా అనేక రకాలుగా గత ఏడాది కాలంగా నిరంతరాయంగా పూర్తి నిబద్ధతతో తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారు. సోనూ సూద్‌ ఫౌండేషన్‌ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 29న ఒక వీడియోను పోస్ట్‌ చేశారు.

కాగా కరోనా కారణంగా తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయిన పిల్లల చదువుకు అంతరాయం కలగకూడదని. తల్లిదండ్రులను పోగొట్టుకున్న కారణంగా ఉత్పన్నమైన ఆర్థిక కారణాలు వారి చదువుకు అడ్డు కాకూడదని కోరుకున్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి పిల్లలకు ఉచిత విద్యను అందించాలని, వారికి ఆర్థికంగా భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం దేశం కలిసికట్టుగా ఈ గండం నుంచి గట్టెక్కాలని పేర్కొన్నారు. ఈ వీడియోనే తాజాగా ప్రియాంక  చోప్రాను ఆకర్షించడం విశేషం. (ఆ పిల్లలకు ఉచిత విద్య అందించాలి: సోనూసూద్‌)

మరిన్ని వార్తలు