హత్రాస్‌ ఘటన: ‘ఎంతమంది నిర్భయలు బలి కావాలి’

1 Oct, 2020 15:00 IST|Sakshi

ముంబై: ఉత్తర ప్రదేశ్‌ హత్రాస్‌లో 19 ఏళ్ల యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సెప్టెంబర్‌ 14న జరిగిన ఈ ఘటన బాధితుఆరలఅఉ సెప్టెంబర్‌ 29న మరణించిన విషయం తెలిసిందే. అయితే గుట్టు చప్పుడు కాకుండా అర్థరాత్రి పోలీసులు బాధితురాలి అంత్యక్రియలు జరిపించడంతో యూపీ సీఎం యోగి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, వామపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధితురాలికి, తన కుటుంబానికి న్యాయం జరగాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సామాన్య ప్రజల నుంచే కాక సెలబ్రెటిల నుంచి నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై గ్లోబర్‌ స్టార్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా కూడా స్పందించారు. హత్రాస్‌ ఘటన నాటి నిర్భయ సామూహిక హత్యచారాన్ని గుర్తు చేసేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: నాలుక కోసి చిత్రహింసలు.. యువతి మృతి)

‘అగౌరవం, దుర్భాష.. నిరాశ, కోపం... మళ్లీ, మళ్లీ, మళ్లీ.. మహిళలు, యువతులు, చిన్నాలపైనే ఎప్పుడూ అఘాత్యాలపై అఘ్యాతాలు... కానీ వారి ఎడుపులు, అరుపులు మాత్రం ఎవరికి వినపడటం లేదు. ఇంకా ఎంత మంది నిర్భయలు బలి కావాలి’ అంటూ ప్రియాంక భావోద్యేగానికి లోనయ్యారు. కాగా సెప్టెంబర్‌ 14న యూపీలోని హత్రాస్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దళితురాలైన యువతిపై నలుగురు అగంతకులు సామూహిక లైంగిక దాడి చేశారు. అనంతరం బాధితురాలిని విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర గాయలతో ఉన్న యువతిని తొలుత యూపీలోని అలీఘర్‌ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో బాధితురాలు సెప్టెంబర్​ 29న మృతి చెందింది. అయితే ఈ ఘటనలో నిందితులైన నలుగురిని అరెస్టు చేసి భారతీయ శిక్షాస్మృతి 302 కింద కేసు నమోదు చేసినట్లు  హత్రాస్‌ ఎస్సై తెలిపారు. (చదవండి: యూపీ నిర్భయ పట్ల అమానవీయం)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా