పదో తరగతిలో బాయ్‌ఫ్రెండ్‌.. ఓ రోజు ఇంట్లో అలా..ప్రియాంక లైఫ్‌ సీక్రెట్‌

3 Aug, 2021 16:45 IST|Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్‌ సినిమాను ప్రపంచస్థాయిలో పాపులర్‌ చేస్తున్న నటీనటుల్లో ప్రియాంకా చోప్రా ఒకరు.  ప్రస్తుతం ఈమెకు హిందీతో పాటు హాలీవుడ్‌లోనూ చక్రం తిప్పుతుంది .పైగా ఈమె పెళ్లి చేసుకున్నది కూడా హాలీవుడ్ కంపోజర్, నటుడు నిక్ జోనస్‌ను. పెళ్లి తర్వాత లండన్‌లోనే సెటిల్ అయిపోయింది ఈ గ్లోబల్‌ బ్యూటీ. 

ఎవరేమనుకున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడడం ప్రియాంకకి అలవాటు. నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంది ఆమె. తాజాగా ఈమె తన జీవితంలోని విశేషాలతో పాటు కొన్ని రహస్యాలను కూడా పంచుకుంటూ అన్‌ ఫినిష్డ్‌ అనే ఓ పుస్తకం రాసింది. దాంట్లో చాలా పర్సనల్‌ విషయాలను వెల్లడించింది ప్రియాంక. తన పదో తరగతి చదువుతున్న సమయంలో జరిగిన ఓ వింత సంఘటను కూడా చెప్పుకొచ్చింది. 

‘పదోతరగతి చదువుతున్న సమయంలో ప్రియాంకకి ఓ బాయ్‌ఫ్రెండ్‌ ఉండేవాడట. పేరు బాబ్‌. తన చలాకీతనం తనం చూసి ప్రేమ పడిపోయానని, అతడినే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నానని చెప్పిన ప్రియాంక.. అతనితో రొమాన్స్‌ చేస్తూ దొరికిపోయిన విషయాన్ని రివీల్‌ చేసింది. 

ఓ రోజు ఎవరూలేని సమయంలో అతను మా ఇంటికి వచ్చాడు. ఇద్దరం కలిసి టీవీ చూస్తుండగా సడెన్‌గా మా ఆంటీ రావడంతో అతన్ని గదిలోనే దాచి పెట్టాను. ఆంటీని బయటకి పంపేంత వరకు లోపలే ఉండమని బాయ్ ఫ్రెండ్‌కు చెప్పాను. కానీ అత్తయ్యకు అనుమానం వచ్చి అల్మారా తెరిచి చూడడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అత్తయ్య సీరియస్‌ అయింది. నా జీవితంలో అత్తయ్యను అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు’అని పుస్తకంలో రాసుకొచ్చింది ప్రియాంక. 

మరిన్ని వార్తలు