‘డ్రెస్‌ జిప్‌ విరగడంతో.. బిగుసుకుపోయాను’

29 Jan, 2021 14:38 IST|Sakshi

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి.. మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలుచుకుని.. బాలీవుడ్‌లో తన సత్తా చాటి.. హాలీవుడ్‌లో దూసుకెళ్తు గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌ వరకు కొనసాగిన తన ప్రయాణం గురించి అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో అన్‌ఫినిష్డ్‌ పేరుతో ఆటోబయోగ్రఫీ తీసుకోస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన జీవితంలో ఎదుర్కొన్న ఓ అత్యంత ఇబ్బందికర పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు ప్రియాంక. 2019లో ప్రియాంక తొలిసారి కేన్స్‌ వేదికపై మెరిశారు. రాబర్టో కావల్లి క్రిషేయన్స్‌ వారు డిజైన్‌ చేసిన కస్టమ్-మేడ్ షిమ్మరింగ్ బ్లాక్ అండ్ రోజ్ గోల్డ్ సీక్విన్ డ్రెస్‌లో కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై హోయలోలికించారు ప్రియాంక. వేదిక గ్లామర్‌ని మరింత పెంచారు. అయితే రెడ్‌ కార్పెట్‌ మీదకు వెళ్లడానికి కొన్ని నిమిషాల ముందు ఆమె ధరించిన డ్రెస్‌ జిప్పర్‌ విరిగిపోయిందట. ఈ ఊహించని పరిణామానికి ఆమె భయంతో బిగుసుకుపోయారట. నాడు తాను అనుభవించిన టెన్షన్‌ గురించి ప్రియాంక ఇన్‌స్టాగ్రమ్‌ వేదికగా వెల్లడించారు. 
(చదవండి: ఆ అనుభూతే వేరు)

‘‘ఈ ఫోటోలో నేను పైకి చూడటానికి ఎంతో చిల్‌ అవుతున్నట్లు.. సంతోషంగా ఉ‍న్నట్లు కనిపిస్తున్నాను. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లోలోపల నేను టెన్షన్‌, భయంతో బిగుసుకుపోయాను. ఎందుకంటే కేన్స్‌ వేదిక మీదకు రావడానికి నిమిషాల ముందు.. రాబర్ట్‌ కావిల్లి డిజైన్‌ చేసిన వింటేజ్‌ బ్లాక్‌ అండ్‌ రోజ్‌ కలర్‌ డ్రెస్‌ ధరిస్తుండగా.. అనుకోకుండా దాని జిప్పర్‌ విరిగిపోయింది. దాంతో ఒక్కసారిగా భయంతో బిగుసుకుపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు... కాసేపు నా బుర్ర పని చేయలేదు. కానీ నాకు అద్భుతమైన టీం ఉంది. వారు కేవలం ఐదు నిమిషాల్లో సమస్యను పరిష్కరించారు. కేన్స్‌ వేదికకు వచ్చే సమయంలో కార్‌లో నా డ్రెస్‌ని కుట్టి సమస్యను పరిష్కరించారు. పెద్ద ప్రమాదం నుంచి నన్ను కాపాడారు. కానీ ఆ టెన్షన్‌ మాత్రం నాలో అలానే ఉంది’’ అంటూ వెల్లడించారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికర అంశాలను తన అన్‌ఫినిష్డ్‌లో పొందుపరిచానని తెలిపారు ప్రియాంక చోప్రా. అలానే గతంలో మిస్‌వరల్డ్‌ సమయంలో కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తెలిపారు ప్రియాంక. తాను ధరించిన డ్రెస్‌కు టేప్‌ అంటుకుందని.. తాను అలానే స్టేజ్‌ మీదకు వెళ్లానని తెలిపారు ప్రియాంక. 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra)

మరిన్ని వార్తలు