‘అప్పుడు తెలివి తక్కువగా ప్రశ్నించాను’

27 Oct, 2020 10:47 IST|Sakshi

నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ప్రియాంక చోప్రా

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా మిస్‌ వరల్డ్‌ నాటి సంఘటనను గుర్తు చేసుకుని ఆ క్షణంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలను తాజాగా పంచుకున్నారు. 2000లో మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ గెలుచుకున్న వీడియోను ప్రియాంక మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అంతేగాక తను కిరీటం ధరించిన అనంతరం ఆమె తల్లి మధు చోప్రా తనతో చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘మిస్‌ వరల్డ్‌ 2000 నాటి వీడియో ఇది. అప్పుడే నాకు 18 సంవత్సరాలు నిండాయి. మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలుచుకున్నాను. ఆ తర్వాత స్టేజ్‌పై నా కుటుంబాన్ని కలుసుకోవడం, శుభాకాంక్షలు తెలుపుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో వెంటనే మా అమ్మ నాతో ‘బేబీ ఇప్పడు నీ చదువు సంగతేంటి? అన్నారు’ అంటూ ఇన్‌స్టాలో ప్రియాంక రాసుకొచ్చారు. ప్రియాంక షేర్‌ చేసిన ఈ వీడియో.. ముగ్గురు ఫైనలిస్టులలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్‌ టైటిల్‌ గెలిచిందని ప్రకటించిన క్షణంతో ప్రారంభమవుతుంది. అనంతరం ప్రియాంక భావోద్యేగంతో మిగతా ఇద్దరూ కంటెస్టంట్‌లను కౌగిలించుకుంటుంది. ఆ తర్వాత ఆమె తలపై కిరీటాన్ని ధరిస్తారు. (చదవండి: హత్రాస్‌ ఘటన: ‘ఎంతమంది నిర్భయలు బలి కావాలి’)

ఈ వీడియో గురించి ప్రియాంక ఆమె తల్లి మధు చోప్రా ఆ సమయంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర సంఘటనల గురించి మాట్లాడుకుంటారు. ప్రియాంక తన తల్లిని ‘మామ్‌ నేను కిరీటం గెలుచుకున్న క్షణాలు గుర్తున్నాయా’ అని అడుగుతుంది. దీనికి ఆమె తల్లి సమాధానం ఇస్తూ.. ‘ముగ్గురు ఫైనలిస్టులో నిన్ను విన్నర్‌గా ప్రకటించగానే హాల్‌ అంతా చప్పట్లు, అరుపులతో మారుమ్రోగింది. ఆ క్షణం​ నేను భావోద్యేగానికి లోనయ్యాను. నా కళ్ల నిండా నీళ్లు తిరగాయి. నేను నిన్ను కౌగిలించకున్నాక ​కిరీటం గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని, నీకు శుభాకాంక్షలు తెలిపాలి. దానికి బదులుగా బేబీ ఇప్పుడు నీ చదువు విషయం ఏంటి అని తెలివి తక్కువగా ప్రశ్నించాను’ అని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ప్రియాంక సోదరుడు కూడా వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుతూ.. తన సోదరి మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలుచుకున్న ఆ క్షణంలో తనలో మెదిలిన ఆలోచనలు పంచుకున్నాడు. (చదవండి: అప్పుడు నేను ఏం ధరించాను? : ప్రియాంక)

‘అప్పుడు నేను 11 లేదా 12 సంవత్సరాలు ఉన్నాను. నాకు బాగా గుర్తుంది. నువ్వు మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలుచుకోగానే నాలో ఎన్నో ర​​కాల ఆలోచనలు ఒక్కాసారిగా మెదిలాయి. నువ్వు గెలిచినందుకు చాలా సంతోషించాను కానీ మరు క్షణమే నేను నా చదువుల కోసం అమెరికా వెళ్లాలని ఆలోచించాను’ అంటూ చెప్పకొచ్చాడు. దీంతో ప్రియాంక మధ్యలో స్పందిస్తూ.. అవును ఆక్షణాలు కొంచం గజిబిజిగా ఉన్నాయి. నేను కూడా నా విజయం తర్వాత నా కుటుంబం ఎలా స్పందిస్తుంది, ఏమి అనుకుంటుందో అని కూడా ఆలోచించలేదు’ అని అన్నారు. కాగా ప్రియాంక 2000లో మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ గెలుచుకోవడం ఒక విశేషం అయితే  అదే ఏడాదిలో నటి లారా దత్తా కూడా మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ గెలుచుకోవడం మరో విశేషం. భారత్‌ తరపు మిస్‌ వరల్డ్‌కు ప్రియాంక చొప్రా, మిస్‌ యూనివర్స్‌గా లారా దత్తాలు అందాలా పోటీ వేదికలకు ప్రాతినిధ్యం వహించి ఇండియాకు రెండు ప్రతిష్టాత్మక టైటిల్‌లను‌ తెచ్చిపెట్టారు. 

మరిన్ని వార్తలు