Priyanka Chopra: పరిణీతి పెళ్లిలో కనిపించని ప్రియాంక చోప్రా.. పైగా అక్కడికి వెళ్లి!

24 Sep, 2023 19:23 IST|Sakshi

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా గురించి పరిచయం అక్కర్లేదు. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన భామ.. ఆ తర్వాత హాలీవుడ్‌కు మారింది. అమెరికాకు చెందిన నిక్‌ జోనాస్‌ ప్రేమవివాహాం చేసుకుంది. ఈ జంటకు సరోగసీ ద్వారా ఓ బిడ్డ కూడా జన్మించింది. అయితే ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్‌ పరిణీతి చోప్రా వివాహాబంధంలోకి అడుగుపెడుతోన్న సంగతి తెలిసిందే. ఆప్‌ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దాను ఆమె పెళ్లి చేసుకుంటోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక జరుగుతోంది. 

ఇదంతా బాగానే ఉన్నా.. చెల్లి పెళ్లికి అక్క ప్రియాంక చోప్రా హాజరు కాకపోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. బంధువులు, సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరవుతున్న ప్రియాంత చోప్రా రాకపోవడం ఏంటా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపింది. మొదట ఈ వివాహానికి ప్రియాంక వస్తుందని అందరూ భావించారు. కానీ ఆమె పెళ్లి హాజరవ్వకుండా అభిమానులకు షాకిచ్చింది.

సంగీత కచేరీకి హాజరు

పరిణీతి చోప్రా పెళ్లికి రాని ప్రియాంక కాలిఫోర్నియాలోని బర్కిలీలో జరిగిన బంగ్లాదేశ్-అమెరికన్ ఆర్టిస్ట్ జై వోల్ఫ్ సంగీత కచేరీకి హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆమె తన భర్త నిక్ జోనాస్ సోదరుడు ఫ్రాంక్లిన్ జోనాస్‌తో కలిసి జై వోల్ఫ్ కచేరీలో పాల్గొంది. అయినా చెల్లి పెళ్లికి రాకపోవడమేంటని ప్రియాంక తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ మండిపడుతున్నారు. 

A post shared by Bushra Khan 🇧🇩 (@b.khanfident)

మరిన్ని వార్తలు