బ్రహ్మాజీపై హీరోయిన్‌ ప్రియాంక కామెంట్స్‌, పోస్ట్‌ షేర్‌ చేసిన నటుడు

27 May, 2021 20:14 IST|Sakshi

టాక్సీవాలా మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమాతోనే సూపర్‌ హిట్‌ అందుకుంది. గ్లామర్ పరంగా, నటనా పరంగా ప్రియాంకకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆ తర్వాత మాత్రం ఆమెకు పెద్దగా సినిమా అవకాశలు లభించలేదు. కానీ సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. దీంతో అవి నెట్టింట తెగ వైరల్‌ అవుతుంటాయి. 

కాగా తాజాగా ప్రియాంక ఏక్‌ మినీ కథ మూవీ చూస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. అంతేగాక ఈ మూవీని బ్రహ్మాజీ కోసమే చూస్తున్నట్లు స్టోరీ పెట్టడంతో దానిని ఆయన తన షేర్‌ చేస్తూ మురిసిపోయారు. ​సంతోష్ శోభన్, కావ్యా థాపర్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘ఏక్ మినీ కథ’ మూవీ ఈ రోజు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. తాజాగా ఈ మూవీని చూస్తున్న ప్రియాంక.. కేవలం బ్రహ్మాజీ కోసమే తాను ఈ చిత్రాన్ని చూస్తున్నానంటు చెప్పుకొచ్చింది. అది చూసిన బ్రహ్మాజీ థ్యాంక్యూ అంటు ఆమె పోస్టుపై కామెంట్‌ చేశాడు.

ఇక ఈ మూవీలో బ్రహ్మాజీ నటన, ఆయన కామెడీకి ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. కామెడీ పండించడంలో బ్రహ్మాజీ స్టైలే వేరంటూ కామెంట్స్‌ కూడా వస్తున్నాయి. కాగా ప్రస్తుతం ప్రియాంక ‘తిమ్మరుసు’ అనే సినిమాతో బిజీగా ఉంది. సత్యదేవ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో ప్రియాంక ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తుండగా బ్రహ్మాజీ కూడా ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఇక ఈ మూవీ సెట్స్‌లో బ్రహ్మజీ, హీరో సత్యదేవ్‌తో ఆమె అల్లరి చేస్తున్న ఫొటోలను కూడా ఆమె షేర్‌ చేస్తుండేది. అలా ఆ మూవీతోనే ప్రియాంకకు, బ్రహ్మాజీతో మంచి బంధం ఏర్పడింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు