Priyanka Jawalkar: ఆ రోజు భయం వేసింది

6 Dec, 2021 14:25 IST|Sakshi
ప్రియాంకా జవాల్కర్‌

‘‘కెరీర్‌లో ఎక్కువ సినిమాలు చేయాలనే కంగారు నాకు లేదు.. కథ నచ్చితేనే నటిస్తాను. కెరీర్‌లో స్లో అయిపోతామని వెంటవెంటనే సినిమాలు అంగీకరిస్తే.. వాటిలో ఎక్కువగా ఫ్లాప్‌ అయితే అప్పుడు కూడా కెరీర్‌కు ఇబ్బందే’’ అని హీరోయిన్‌ ప్రియాంకా జవాల్కర్‌ అన్నారు. శ్రియా శరన్, శివ కందుకూరి, నిత్యామీనన్, ప్రియాంకా జవాల్కర్‌ ప్రధాన పాత్రల్లో సంజనా రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గమనం’. రమేష్‌ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. 


ఈ సందర్భంగా ప్రియాంకా జవాల్కర్‌ మాట్లాడుతూ– ‘‘గమనం’ సినిమా కథ విన్నప్పుడు ‘వేదం’ గుర్తొచ్చింది. సంజనా రావు మహిళా దర్శకురాలు కావడంతో మరింత ఎక్కువగా కనెక్టయ్యాను. ఈ చిత్రంలో జారా అనే ముస్లిం యువతి పాత్రలో కనిపిస్తాను. నటనకు స్కోప్‌ ఉన్న పాత్రే అయినప్పటికీ కథ రీత్యా నా పాత్రకు పెద్దగా డైలాగ్స్‌ ఉండవు. ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మాట్లాడాలి.. కళ్లతో హావభావాలు చూపించాలి. ఇదే కష్టంగా అనిపించింది. 

శివకందుకూరి గ్రాండ్‌ఫాదర్‌గా చారుహాసన్‌గారు కనిపిస్తారు. ఓ రెయిన్‌ సీక్వెన్స్‌లో చారుహాసన్‌గారితో కలిసి నటించాను. నటన, వయసు ప్రకారం ఆయన చాలా పెద్దాయన. నా నటనతో (ఎక్కువ టేకులు తీసుకోవడం) ఆయన్ను ఏమైనా ఇబ్బంది పెడతానేమోనన్న భయం షూటింగ్‌ రోజు కలిగింది. కానీ చిత్రీకరణ అనుకున్నట్టుగా బాగానే సాగింది. ఈ సినిమాకు ఇళయరాజాగారు సంగీతం అందిస్తున్నారని తెలియగానే చాలా సంతోష పడ్డాను. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా నాకు నచ్చింది. కథ డిమాండ్‌ చేస్తే బోల్డ్‌ క్యారెక్టర్స్‌ చేయడానికి సిద్ధమే’’ అన్నారు. (చదవండి: ‘అఖండ’ ఫైట్‌ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు