NBK 108: బాలయ్యకు హీరోయిన్‌గా అనంతపురం అమ్మాయి.. అమ్మడి అదృష్టం మారుతుందా?

6 Dec, 2022 13:27 IST|Sakshi

హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాక్సీవాలా, తిమ్మరసు,‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’ వంటి సినిమాలతో ఆకట్టుకున్నా భారీ హిట్‌ను మాత్రం ఖాతాలో వేసుకోలేకపోయింది. అనంతపురానికి చెందిన ప్రియాంక తెలుగుమ్మాయి అయినప్పటికీ టాలీవుడ్‌లో వరుస అ‍వకాశాలను దక్కించుకుంటుంది. తాజాగా ఆ భామ మరో క్రేజీ ఛాన్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తుంది. బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రియాంక జవాల్కర్‌ నటించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు యంగ్‌ హీరోల పక్కనే నటించిన ప్రియాంకకు ‘NBK 108’ సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. 

మరిన్ని వార్తలు