అల్లు అర్జున్‌ అంటే క్రష్‌: ప్రియాంక

11 Aug, 2021 16:16 IST|Sakshi

టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్‌‌‌‌‌లో అడుగుపెట్టిన తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్. నార్త్‌ హీరోయిన్ల హవా కొనసాగుతున్న సమయంలో వారికి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది ఈ అచ్చ తెలుగు భామ. తాజాగా సత్యదేవ్‌ ‘తిమ్మరుసు’, కిరణ్‌ అబ్బవరం ‘ఎస్‌.ఆర్‌. కల్యాణమండపం’సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.  ఈ రెండు చిత్రాల్లో ప్రియాంక అందం, నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ బ్యూటీ అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు అల్లు అర్జున్‌ అంటే క్రష్‌ అని తన మనసులోని మాటలను బయటపెట్టింది. అలాగే విజయ్‌ దేవరకొండ గురించి చెబుతూ.. ఆయన తనకంటే చిల్‌ అని కామెంట్‌ చేసింది. ఇక సత్యదేవ్‌, కిరణ్‌ అబ్బవరం గురించి మాట్లాడుతూ.. కిరణ్ చాలా ఇన్నోసెంట్ అని, కిడ్‌లా వ్యవహరిస్తుంటాడని, అలాగే సత్యదేవ్ చాలా హార్డ్ వర్కర్ అని చెప్పుకొచ్చింది. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. తెలుగులో కొన్ని స్క్రిప్ట్స్ విన్నానని, త్వరలో ఫైనల్ చేస్తానని చెప్పింది. ఓటీటీ ఆఫర్స్ వస్తున్నాయని, స్క్రిప్ట్ నచ్చితే కమిట్ అవుతానని తెలిపింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు