చిక్కుల్లో నటి రాధికా కుమారస్వామి

7 Jan, 2021 10:42 IST|Sakshi

నిందితుని నుంచి భారీగా నగదు బదిలీ?

సాక్షి, బెంగళూరు: చీటింగ్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ చోటా నాయకుడు యువరాజ్‌ బ్యాంకు ఖాతా నుంచి నటి రాధికా కుమారస్వామి, మరో నిర్మాతకు కోటి రూపాయిల వరకు బదిలీ అయినట్లు సీసీబీ అధికారులు గుర్తించారు. రాధికాను విచారించాలని నిర్ణయించారు. ఆమె సోదరున్ని ఇప్పటికే ప్రశ్నించి ఈ వంచన కేసులో అనేక విషయాలను సేకరించారు. చదవండి: (స్టాక్‌ మార్కెట్‌ నష్టాలు.. కుటుంబం ఆత్మహత్య)

తనకు పెద్ద పెద్ద ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకులు తెలుసు, పనులు ఏవైనా చేయిస్తానని పలువురి నుంచి పెద్దమొతాల్లో నగదును యువరాజ్‌ స్వాహా చేసినట్లు ఫిర్యాదులు రావడంతో సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే యువరాజ్‌ కుటుంబానికి– తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నట్లు రాధికా కుమారస్వామి తెలిపారు. ఆమె బుధవారం బెంగళూరు డాలర్స్‌ కాలనీలో విలేకర్లతో మాట్లాడారు. ఆయన అకౌంట్‌ నుంచి రూ.15 లక్షలు ఒక సినిమా అడ్వాన్స్‌గా తన ఖాతాకు బదిలీ అయిందన్నారు. తన తమ్ముడు రవిరాజ్‌ అకౌంట్‌కు ఏమీ బదిలీ కాలేదన్నారు.  చదవండి: (నిన్ను చంపేస్తాం..)

మరిన్ని వార్తలు