నంది అవార్డులపై నిర్మాత అది శేషగిరావు కీలక వ్యాఖ్యలు

1 May, 2023 12:38 IST|Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులపై ప్రముఖ నిర్మాత ఆది శేషగిరిరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నవాళ్లకే నంది అవార్డ్స్‌ ఇస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయాక నంది అవార్డులను ఎవరూ పట్టించుకోవట్లేదన్నారు.

మే31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీరిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ.. రెండు ప్రభుత్వాలు ఫిల్మ్‌ ఇండస్ట్రీని పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రకటించే అవార్డులకు చాలా ప్రాముఖ్యత ఉండేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. తన ఉద్దేశంలో నంది అవార్డులకు ప్రాముఖ్యత లేదని తెలిపారు. 

(చదవండి: చైతన్య మాస్టర్‌ ఆత్మహత్య.. శ్రద్దా దాస్‌, శేఖర్‌ మాస్టర్‌ ఎమోషనల్‌ )

గతంలో కూడా పలువురు సినీ ప్రముఖులు నంది అవార్డుల ప్రకటనపై అసంతృప్తి వెల్లడించారు. చంద్రబాబు నాయుడు హయాంలో కులాలను బట్టే నంది అవార్డులను ప్రకటించేవారని ప్రముఖ నటుడు పొసాని కృష్ణమురళి ఆరోపించారు. ప్రతిభను ప్రామాణికంగా తీసుకోకుండా.. చంద్రబాబు భజనే కొలమానంగా తీసుకొని అవార్డుల పంపకాలు జరిగాయని విమర్శించారు. ఇప్పుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ సోదరుడు, మహేశ్‌బాబు బాబాయ్‌ ఆది శేషగిరిరావు కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. 

మరిన్ని వార్తలు