Allu Aravind: అందుకే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు: అల్లు అరవింద్‌

5 Dec, 2022 21:25 IST|Sakshi

అలా చేయడం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆధునికీకరణ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో వస్తున్నారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ 2’ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన థియేటర్ల వ్యవస్థ గురించి మాట్లాడారు. ఇదే షోలో ఆయనతోపాటు మరో నిర్మాత దగ్గుబాటి సురేశ్‌, దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి పాల్గొన్నారు.


అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'థియేటర్లు పడిపోతున్న సమయంలో ఆయా థియేటర్ల యజమానులు వాటిని పైకి రావాలనుకుంటారు. వాటిని మామూలు స్థితికి తీసుకురావడం, సినిమాలు కొనుక్కోవడం వారికి పెద్ద సవాలుగా మారింది. దాన్ని భరించలేక ‘థియేటర్లను మీరే రన్‌ చేయండి.. మాకు సంవత్సరానికి ఇంత ఇవ్వండి’ అని థియేటర్ల ఓనర్లు నిర్మాతలను కోరారు.

అలా మేం వాటిని తీసుకొని కొన్ని కోట్ల రూకపాయలతో మంచిగా తీర్చిదిద్దాం. అన్ని వసతులు ల్పించాం. అలా థియేటర్లను ఆధునికీకరించడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. వసూళ్లు ఎక్కువగా వస్తున్నాయి. మీలాంటి పెద్ద హీరోలకు అవకాశాలు ఇవ్వగలుగుతున్నాం.' అని తెలిపారు. దీనిపై సురేశ్‌ స్పందిస్తూ.. దీని వల్ల కొందరికి థియేటర్లు దొరక్కపోవడంతో పలు సందర్భాల్లో విమర్శించారన్నారు. అందరూ కలిసి సినిమాను బతికించారని అరవింద్‌ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం, చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్‌లో ఓ చిత్రం నిర్మించాలనుందనే తన కోరికను బయటపెట్టారు.

మరిన్ని వార్తలు