Ari Movie: ‘అరి’ ట్రైలర్‌ చూడగానే పులకింత వచ్చేసింది: నిర్మాత అశ్వనీదత్‌

14 Mar, 2023 18:11 IST|Sakshi

‘అరి సినిమా ట్రైలర్‌ చూశాను. చాలా అద్భుతంగా ఉంది.  ట్రైలర్ చూడగానే టెక్నీషియన్ అంతా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు అనిపిస్తోంది. ఈ సమ్మర్ లో వస్తోన్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ అన్నారు. పేపర్‌బాయ్‌ ఫేం జయశంకర్‌ దర్శకత్వం వహించిన రెండో చిత్రం అరి. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది.

నిర్మాత  అశ్వనీదత్‌ని కూడా ట్రైలర్‌ ఆకట్టుకుంది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెస్కే ప్రసాద్ గారి ద్వారా నిర్మాత శేషుగారు నిర్మించిన అరి చిత్ర ట్రైలర్ ను చూశాను. చూడగానే నాకు ఎంతో పులకింత వచ్చేసింది. పర్టిక్యులర్ గా చెప్పాలంటే శ్రీ కృష్ణుడు ఎక్కడ కనిపించినా.. మా వైజయంతీ మూవీస్ లాగా అది ఎప్పుడూ శుభ సూచకం. గ్యారెంటీ హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ అందరికీ అడ్వాన్స్ గా కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నాను’ అన్నారు.

మరిన్ని వార్తలు