పోలీస్‌ అవ్వాలనుకున్నా...కానీ ఈ సినిమాతో అయ్యాను: నిర్మాత

2 Sep, 2022 01:40 IST|Sakshi

‘‘అల్లూరి’లో శ్రీ విష్ణు విశ్వరూపం చూస్తారు. తన కెరీర్‌లో ఇది బెస్ట్‌ మూవీ అవుతుంది’’ అని నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ అన్నారు.   శ్రీ విష్ణు పోలీసాఫీసర్‌గా నటించిన చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్‌ వర్మ దర్శకత్వం వహించారు. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది.  బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ– ‘‘నేను చిన్నప్పుడు పోలీస్‌ అవ్వాలనుకున్నాను.. కానీ కాలేకపోయాను. అందుకే ‘అల్లూరి’ సినిమాలో పోలీస్‌ పాత్రను చాలా ఇష్టంగా చేశాను.

ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. ‘దిల్‌’ రాజుగారి సపోర్ట్‌ నాకు ఎప్పుడూ ఉంటుంది. ఈ మధ్య షూటింగ్స్‌ నిలిపివేసి చర్చించడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి.. వాటిని త్వరలోనే వెల్లడిస్తాం. వైజాగ్‌లోని అల్లూరి సీతారామరాజుగారి సమాధి దగ్గర నుంచి ఈ నెల 3 నుండి ‘అల్లూరి’ యూనిట్‌ యాత్రని ప్రారంభిస్తున్నాం. వైజాగ్‌లో మొదలైన టూర్‌ వరంగల్, నిజామాబాద్‌ వరకూ కొనసాగుతుంది. ప్రస్తుతం ‘బూట్‌ కట్‌ బాలరాజు’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ నిర్మిస్తున్నాను’’ అన్నారు. 

మరిన్ని వార్తలు