‘గ్రూపు రాజకీయాలతో ఇండస్ట్రీని డ్యామేజ్ చేస్తున్నారు’

4 Oct, 2020 19:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికం తగ్గింపుపై ప్రముఖ సినీ ప్రొడ్యూసర్‌, నిర్మాత మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్‌ స్పందించారు. రెమ్యునరేషన్‌ను20 శాతం తగ్గించమని అడగడంలోనే నిర్మాతల అసమర్ధత వెల్లడవుతోందని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూపు రాజకీయాలతో ఇండస్ట్రీని డ్యామేజ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ‘నిర్మాతలు పని కల్పించేవాళ్లు.. తమ దగ్గర పనిచేసే వారికి పారితోషికం నిర్ణయించాల్సింది వాళ్లే.. కాకపోతే 20 శాతం తగ్గించమని అందరినీ అడగడంలోనే నిర్మాతల అసమర్థత వెల్లడవుతోంది. గ్రూపు రాజకీయాలతో ఇండస్ట్రీని అభాసుపాలు చేస్తున్నారు. అది సరైనది కాదు. కూర్చుని మాట్లాడుకోవాలి. నిర్మాతల్లో యూనిటీ లేకపోతే కష్టం. నిర్మాతల్లోనే కొందరు దొంగల్లాగా మారి, అవతలివారిని ఇబ్బందిపెట్టడం కరెక్ట్ కాదు’అని కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు.
(చదవండి : పారితోషికం కట్‌)

కాగా, రోజుకు 20 వేలకు పైగా రెమ్యునరేషన్‌ తీసుకునే ఆర్టిస్టులకు 20 శాతం.. సినిమాకు ఐదు లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే టెక్నీషియన్లకు 20 శాతం చొప్పున తగ్గించాలని యాక్టివ్‌ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌(ఏటీఎఫ్‌ పీజీ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు