'నారప్ప' ఓటీటీలో ఎందుకు రిలీజ్‌ చేస్తున్నామంటే...

18 Jul, 2021 08:26 IST|Sakshi

 ఓటీటీ రిలీజ్‌పై నారప్ప నిర్మాత కలైపులి ఎస్‌.థాను వివరణ 

చెన్నై: అగ్రకథానాయకుడు వెంకటేష్‌ తాజా చిత్రం నారప్ప. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 14వ తేదీ థియేటర్లలో విడుదల చేయాలని భావించినా కరోనా పరిస్థితుల్లో సాధ్యపడలేదు. సినిమాను ఈ నెల 20వ తేదీ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన కలైపులి ఎస్‌.థానుతో సాక్షితో శనివారం ముచ్చటించారు. తమిళంలో తాను నిర్మించిన అసురన్‌ చిత్రం ఘన విజయం సాధించిందన్నారు. తెలుగులో వెంకటేష్‌ హీరోగా నారప్ప పేరుతో రీమేక్‌ చేయడం సంతోషంగా ఉందన్నారు.

‘ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి కారణం ఏంటని చాలామంది అడుగుతున్నారు. నిజానికి నా చిత్రాలను థియేటర్లలో విడుదల చేయడానికే ఇష్టపడుతుంటాను. నారప్ప చిత్రాన్ని కూడా మే 14న థియేటర్లలో విడుదల చేయాలని భావించాం. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తే సేఫ్‌ అవుతామన్న గ్యారెంటీ లేదు. నేను ఇంతకు ముందు తమిళంలో నిర్మించిన కర్నన్‌ ఆ చిత్రానికి సుమారు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు నష్టపోయాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే నారప్ప చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నా’నని కలైపులి ఎస్‌.థాను వివరించారు.

మరిన్ని వార్తలు