ఓటీటీల వల్ల భారీ నష్టం: నిర్మాత సూరేశ్‌ బాబు

2 Jun, 2021 21:52 IST|Sakshi

ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో అన్ని రంగాలు కుదేలవుతుంటే ఓటీటీ సంస్థలు మాత్రం లాభాల్లో నడుస్తున్నాయి. కోవిడ్‌ ఉధృతి కారణంగా థియేటర్లు మూతపడటంతో పెద్ద సినిమాలు సైతం ఓటీటీ బాట పడుతున్నాయి. చూస్తుంటే రాబోయే కాలం కూడా చాలా సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. దీనివల్ల దర్శక-నిర్మాతలకు కాస్తా లాభపడిన థియేటర్ల నిర్వాహకులు, ఎగ్జిబిటర్స్‌కు తీవ్రంగా నష్టపోతారు. ఇదిలా ఉండగా ఓటీటీలపై నిర్మాత దగ్గుబాటి సూరేశ్‌ బాబు ఇదివరకే అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాలు బతకాలంటే థియేటర్లు ఉండాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిని ఆలోచించేలా చేశాయి. తాజాగా మరోసారి ఆయన ఓటీటీలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాగా సూరేశ్‌ బాబు నిర్మాతగానే కాక ఎగ్జిబిటర్‌గా వ్యవహరిస్తారనే విషయం తెలిసిందే. అందువల్ల థియేటర్లు ఎదుర్కొనే కష్టాలు, లాభానష్టాలపై ఆయనకు అవగాహన బాగానే ఉంటుంది. అంతేగాక ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వస్తారు.. ఎలాంటి సినిమాలు చూస్తారనే దానిపై కూడా ఆయనకు ఓ క్లారిటీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో సినిమాలు ఓటీటీలో విడుదల కావడం వల్ల వచ్చే నష్టంపై ఆయన మాట్లాడుతూ.. ‘ఇలా సినిమాలు నేరుగా విడుదల చేయడం వల్ల ఖచ్చితంగా థియేటర్లపై ప్రభావం భారీగానే పడుతుంది. కానీ నిర్మాతలకు ఇప్పుడు మరో ఆప్షన్ కూడా లేదు. అది వాళ్ల వాళ్ల ఇష్టం. అయితే ఈ రోజుల్లో చాలా మంది థియేటర్లకి రావడానికి కంటే కూడా ఇంట్లో టీవీలో లేదా స్మార్ట్‌ ఫోన్లలోనే సినిమాలు చూసేందుకు ఆసక్తికిని చూపుతున్నారు.

థియేటర్లకు వెళ్లడం కంటే కూడా ఇదే సులువని భావించేవారు ఎక్కువే ఉన్నారు. ఇలాంటి సమయంలో కూడా పెద్ద పెద్ద నగరాల్లో వీకెండ్స్ థియేటర్లకు రావటానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని.. బడ్జెట్ అదుపులో ఉంచుకొని దర్శకులు స్టాండర్డ్ సినిమాలు తీయాలనేది నా అభిప్రాయం’ అంటూ ఆయన వివరించారు. అలా చేయకపోతే కచ్చితంగా థియేటర్ల వ్యవస్థపై భారీ ప్రభావం పడటం ఖాయమని ఆయన అన్నారు. ఇంత తెలిసి మీరేందుకు ఎందుకు ఓటిటీ వైపు వెళ్లడం లేదని హోస్ట్‌ ప్రశ్నించగా ‘అమెజాన్, నెట్ ఫ్లిక్స్‌లు నష్టాల్లోనే తమ సంస్థలను నడుపుతున్నారు. అందుకే తాను అటువైపు వెళ్లడం లేదని ఆయన సమాధానం ఇచ్చారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు