Seetharamauramlo Movie Teaser:  దిల్ రాజు చేతులమీదుగా  ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’ ట్రైలర్‌ రిలీజ్

3 Oct, 2022 18:00 IST|Sakshi

రణధీర్‌, నందిని హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. ఈ సినిమాకు వినయ్ బాబు దర్శకత్వం వహించగా.. శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌ బ్యానర్‌పై బీసు చందర్‌ గౌడ్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు చేతులమీదుగా ట్రైలర్‌ విడుదల చేశారు. 

దిల్‌ రాజు మాట్లాడుతూ...‘ ఈ సినిమా టైటిల్‌తో పాటు ట్రైలర్‌ కూడా చాలా బావుంది. హీరో హీరోయిన్ల జంట చూడముచ్చటగా ఉంది. ట్రైలర్‌ చూస్తుంటే దర్శకుడి ప్రతిభ ఏంటో అర్థమైంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’అని అన్నారు. దర్శకుడు వినయ్‌ బాబు మాట్లాడుతూ...‘‘మా చిత్రం ట్రైలర్‌ దిల్‌ రాజు గారి చేతుల మీదుగా లాంచ్‌ కావడం ఎంతో ఆనందంగా ఉంది. ట్రైలర్‌ నచ్చి మా చిత్రం యూనిట్‌ ప్రశంసించారు. నిజాయితీ గా ప్రేమించుకున్న ప్రతి యువతీ, యువకులు చూడాల్సిన చిత్రమిది' అని అన్నారు. 

 నిర్మాత బీసు చందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ సినిమా. ఈ చిత్రంతో  రణధీర్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. నందిని హీరోయిన్‌గా నటించింది. మా చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన దిల్‌ రాజు గారికి ధన్యవాదాలు. త్వరలో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు.

మరిన్ని వార్తలు