Dil Raju: 'హలో గురు ప్రేమ కోసమే' అంటూ పాట పాడిన దిల్‌రాజు

13 Dec, 2021 15:29 IST|Sakshi

Producer Dil Raju Sings a Song Her Wife Video Viral: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు గాయకుడిగా మారారు. కరీంనగర్‌లోని ఓ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా గ్రూపుతో కలిసి స్టేజ్‌ మీద పాట పాడి సందడి చేశారు. నాగార్జున నటించిన నిర్ణయం సినిమాలోని ని 'హలో గురూ ప్రేమ కోసమేరోయ్...' అనే పాటను ఎంతో ఉల్లాసంగా ఆలపించారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ పాటను దిల్‌రాజు తన శ్రీమతికి డెడికేట్‌ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి దిల్‌రాజుతో పాటు మంత్రి గంగుల కమలాకర్ కూడా హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు